ఘనంగా హై బిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ – 2022 ప్రదానోత్సవం

వైద్య రంగంలో అద్భుత సేవలు అందిస్తున్న డాక్టర్లు, విశిష్ట వ్యక్తులు, ఆస్పత్రులకు పురస్కారాల ప్రదానం

45 విభాగాల్లో అవార్డులు అందించిన హై బిజ్ టీవీ

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు

కార్యక్రమంలో భాగంగా చిన్నారుల కోసం మెడికల్ క్యాంప్ నిర్వహణ

హైదరాబాద్

వైద్యో నారాయణో హరిః..! అంటే వైద్యులు దేవుడితో సమానం అని అర్థం. తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తారు. ప్రాణ రక్షకులుగా, సలహాదారులుగా, శ్రేయోభిలాషులుగా రోగులకు అండగా నిలుస్తారు. తమ వృత్తినే దైవంగా భావించి సేవ చేస్తారు. అలాంటి డాక్టర్లను హై బిజ్ టీవీ ఘనంగా సత్కరించింది. వైద్య రంగంలో అపారమైన సేవలు అందిస్తున్న డాక్టర్లు, ఇతర ప్రముఖులు, ఆస్పత్రులకు పురస్కారాల ఇచ్చి గౌరవించింది. మొత్తం 45 విభాగాల్లో అవార్డులను అందజేసింది.

హైదరాబాద్ లోని హెచ్.ఐ.సి.సి – నోవాటెల్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలను అందజేశారు. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్, డాక్టర్ భద్రా రెడ్డి (ఛైర్మెన్ – మల్లారెడ్డి హెల్త్ సిటీ), డాక్టర్ ప్రీతి రెడ్డి ( ఎండీ – మల్లారెడ్డి హెల్త్ సిటీ), రాజ్ గోపాల్ మాడిశెట్టి ( ఫౌండర్ & ఎండీ – హై బిజ్ టీవీ & తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి ( సీఈఓ – హై బిజ్ టీవీ & తెలుగు నౌ) తదితరులు ఇందులో పాల్గొన్నారు.

హై బిజ్ టీవీ గతంలో పలు విభాగాల్లో అవార్డులను అందజేసింది. ఉమెన్స్ లీడర్ షిప్ అవార్డ్స్ (2020, 2021, 2022), మీడియా అవార్డ్స్ (2021, 2022) వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించింది. వాటి స్పూర్తితో హై బిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ కు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే.. కార్డియాలజీ, సీటీ సర్జరీ, న్యూరాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, అనెస్థిటిక్స్ కేటగిరీల్లో అవార్డులు ఇచ్చింది. అలాగే, నెఫ్రాలజీ, ఇ.ఎన్.టి, ఆప్తాల్మాలజీ, గైనకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, డయాబెటాలజీ, జనరల్ ఫిజీషియన్, ఎండోక్రినాలజిస్ట్, వ్యాస్కులర్ సర్జరీ, ఆంకాలజీ/ హెమటాలజీ విభాగాల్లో పురస్కారాలను అందజేసింది. వీటితో పాటుగా రేడియాలజిస్ట్, సైకాలజిస్ట్, రుమటాలజీ, జనరల్ సర్జరీ, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్, అంబులెన్స్ సర్వీసెస్, ఆయుర్వేదం, బేరియాట్రిక్ సర్జరీ, మైక్రో బయాలజీ, డాక్టర్ + ఆర్టిస్ట్, డాక్టర్ + పొలిటీషియన్ తదితర విభాగాల్లో పురస్కారాలు ప్రదానం చేసింది.

వీటితో పాటుగా సోషల్ ఆర్గనైజేషన్స్, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్, లెజెండరీ డాక్టర్స్, ట్రైల్ బ్లేజర్స్ కు హెల్త్ కేర్ పురస్కారాలు దక్కాయి. అత్యంత అనుభవజ్ఞులైన జ్యూరీ సభ్యులు ఈ విజేతలను ఎంపిక చేశారు. పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరిగింది.

కార్యక్రమంలో భాగంగా … కంటి చూపు లేని చిన్నారుల కోసం స్పెషల్ మెడికల్ క్యాంప్ ను హై బిజ్ టీవీ నిర్వహించింది. దీనికి మల్లారెడ్డి గ్రూప్ సహకారాన్ని అందించింది. జంటనగరాల నుంచి చాలా మంది పిల్లలు ఈ మెడికల్ క్యాంప్ నకు హాజరయ్యారు. వారందరికీ డాక్టర్ల బృందం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించింది.

హై బిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ కు డ్రీమ్ వ్యాలీ గ్రూప్ ప్రధాన భాగస్వామిగా వ్యవహరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐ.ఎం.ఎ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కౌన్సిల్, తెలంగాణలోని డాక్టర్లు సహకారాన్ని అందించారు. పవర్డ్ బై డాక్ ట్యుటోరియల్స్. జ్యువెలరీ పార్ట్ నర్ గా మానేపల్లి జ్యువెలర్స్, గోల్డ్ స్పాన్సర్ గా కాసా వాటర్ సైడ్ వ్యవహరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *