ఆకట్టుకున్న ఆగ్రీ ఆర్ట్
రైతుల జీవన స్థితిగతులను కళల ద్వారా ప్రపంచానికి తెలియజేసేందుకు చిత్రకారిణి రమణి ముందుకు వచ్చారు. హైదరాబాద్ మాదాపూర్ లోని ఆర్టిస్ట్ రమణి మైలవరపు …ఏ డే ఇన్ ఏ ఫార్మర్ లైఫ్ పేరుతో డిజిటల్ ఫోటో, వీడియో, లైవ్ ఫర్పార్మెన్స్ చేశారు. వ్యవసాయాన్ని నమ్ముకుని పనిచేస్తున్న రైతు కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపారు. దేశంలో రైతులకు తమ కళల ద్వారా సముచిత గౌరవం తీసుకువచ్చేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామని రమణి తెలిపారు.
తాను స్వతహాగా చిత్రకారిణి అని… రైతు కుటుంబం నుంచి వచ్చానని..రైతు కష్టాలను ప్రజలకు ఆర్ట్ ద్వారా తెలియజేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు రమణి మైలవరపు తెలిపారు. ఇప్పటికే రైతుల కష్టాలపై ఎన్నో చిత్రాలు వేశానని… డిజిటల్ ఆర్ట్ , వీడియో , లైవ్ ఫర్పార్మెన్స్ ద్వారా కొత్త ఆర్ట్ ను పరిచయం చేస్తున్నట్లు ఆమె తెలిపారు .