హైదరాబాద్ లో ల్యాప్రోస్కోపీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్

హైదరాబాద్ ,చందానగర్

హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి ల్యాప్రోస్కోపీ శిక్షణా కేంద్రాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ ప్రారంభించారు .

హైదరాబాద్ మదీనాగూడలోని టీవీఆర్ ల్యాప్రోస్కోపీ సెంటర్ లో సర్జన్ లకు ల్యాప్రోస్కోపీ శిక్షణా కోర్సు అందుబాటులో ఉంచడం అభినందనీయమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, IMA అకాడమీ అఫ్ మెడికల్ స్పెషలిస్ట్స్ హానరరీ సెక్రటరీ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ తెలిపారు .

యువ సర్జన్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ డాక్టర్ ఐలయ్య మండల కోరారు.

ఈ సందర్భముగా టీవీఆర్ లాపరోస్కోపీ సెంటర్ అధినేత డాక్టర్ తిరుమలగిరి. వరుణ్ రాజు మాట్లాడుతూ ఇది MS చదువుతున్న లేదా పాస్ అయిపోయిన జనరల్ సర్జన్లు, గైనాకలాజీ స్పెషలిస్ట్స్ లు ల్యాప్రోస్కోపీ కోర్సులో చేరవచ్చని తెలిపారు.

మూడు నెలల కోర్సు ఉంటుందని తరువాత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు . వ్యక్తిగతం గా అన్ని విభాగాల్లో ఎండో ట్రైనర్ , సింతెటిక్ హ్యూమన్ బాడీ పద్ధతులు ఉపయోగించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు . ఈ పద్దతి ద్వారా శిక్షణ తీసుకునే సర్జన్ కు నిజంగా ఆపరేషన్ చేసే అనుభూతి ,అనుభవాలు కలిగి తన ప్రాక్టీస్ కు చాలా ఉపయోగం అవుతుంది అని తెలిపారు. మరిన్ని వివరాలకు Y. శ్రీనివాస్ కు ఫోన్ చేసి తెలుసుకో వచ్చు. ఫోన్ నెంబర్ 8886177750,040-35109292ను సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *