ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తే మీతో కలిసి వస్తాం -టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్
హైదరాబాద్ ,బంజారాహిల్స్
రాష్ట్ర విభజన సమస్యలు, ప్రత్యేక హోదా కోసం వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు .సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో 25 మంది ఎంపీలను ఇస్తే… కేంద్రం మెడలు వంచి హోదా తీసుకువస్తామని చెప్పిన హామి ఏమైందని ప్రశ్నించారు .
ప్రత్యేక హోదా, విభజన సమస్యల పరిష్కారానికి వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే…తమ పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేసి మద్దతు తెలుపుతామన్నారు . వైకాపా ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదాపై పోరాడితే.. తామూ కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా కార్యాచరణకు తమ మద్దతు ఉంటుందన్నారు. వైకాపాకు 28 మంది ఎంపీలున్నా కేంద్రంపై ఒత్తిడి తేవట్లేదని విమర్శించారు. హోదాకు తెలంగాణ సహకారం ఉన్నా వైకాపా ఎందుకు వైఫల్యం చెందుతుందో అర్థం కావట్లేదన్నారు.
“అజెండాలో ప్రత్యేక హోదా అంశం ఎందుకు పెట్టలేదు ?. వైకాపా ప్రభుత్వానికి కేంద్రంతో ఉన్న ఒప్పందమేంటి ?. అజెండా మారడానికి జగన్ కేంద్రానికి రాసిన లేఖనే కారణమన్నారు. వైకాపాకు 28 మంది ఎంపీలున్నా కేంద్రంపై ఒత్తిడి తేవట్లేదని.. హోదాకు తెలంగాణ సహకారం ఉన్నా వైకాపా ఎందుకు వైఫల్యం చెందుతుందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశంపై వైకాపా వైఫల్యమా ? లొంగుబాటా ?. వైకాపాపై మాకు అనుమానం కలుగుతోందన్నారు. అజెండాలో హోదా అంశం ఎవరు చెబితే తొలగించారు ?. హోదాపై మంచైతే వైకాపాకు.. చెడైతే చంద్రబాబుపై నెడుతున్నారని చెప్పారు. ప్రాణమిత్రులు విభజన హామీలు ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి ?. వైకాపా వల్ల కాదని జగన్ చెబితే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు . ప్రత్యేక హోదా కోసం వైకాపా పోరాడితే మేము కలిసివస్తామని… హోదా కోసం వైకాపా ఎంపీలు రాజీనామా చేయండి. వైకాపా ఎంపీలతో పాటు మేము కూడా రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు . కేంద్రం హోదా ఇవ్వకపోతే వైకాపా కార్యాచరణ ఏంటో చెప్పాలి అని డిమాండ్ చేశారు .