మహిళలు చదివితే దేశానికి ఉపయోగం: రాష్ట్రపతి..!
విలువలతో కూడిన విద్యావ్యవస్ధ, సాంస్కృతిక విలువల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విద్యార్ధులకు సూచించారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి మంగళవారం నారాయణగూడలోని ఒదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవొద్దని కేశవ్ మెమోరియల్ కాలేజీలో విద్యార్థుల ముఖాముఖిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏ రంగంలోనైనా ఆత్మసంతృప్తి చాలా ముఖ్యమని సూచించారు. మన రాజ్యాంగం మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని, అన్ని విషయాలను అమెరికాతో పోల్చుకోవద్దని చెప్పారు. ఒక వ్యక్తి చదివితే ఆ కుటుంబానికే ఉపయోగమన్న రాష్ట్రపతి.. మహిళలు చదివితే దేశానికే ఉపయోగమని స్పష్టం చేశారు.
