అగ్రరాజ్యం గజ గజ.. మంచు మడతెట్టేస్తోంది..!
అమెరికాలో కనీవినీ ఎరుగని రీతిలో మంచు కురుస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్లు, రోడ్లు అని తేడా లేకుండా ఎక్కడ చూసినా మంచే కనిపిస్తోంది. న్యూయార్క్ లో హిమ ప్రభావం తీవ్రంగా ఉంది. మంచు తుపాన్ కారణంగా ఈ ఒక్క రాష్ట్రంలోనే వివిధ ప్రమాదాల్లో 27 మంది చనిపోగా.. దేశవ్యాప్తంగా 48 మంది మృతి చెందారు. మంచు ప్రభావంతో వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ఇక జపాన్లోనూ విపరీతంగా కురుస్తున్న మంచు ధాటికి 17 మంది. ప్రాణాలు కోల్పోయారు.
