ఇంటి వద్దనే వాహన రిపేరు సదుపాయం అందిస్తున్న హైదరాబాద్ స్టార్టప్ సంస్థ యాక్సిలెరాన్ టెక్నోలాజిక్స్

హైదరాబాద్‌, తెలంగాణ:

హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా 2020 మార్చిలో ప్రారంభమైన రిపేర్‌ స్టార్టప్‌ అనేక
అసంఘటిత సేవలను అందిస్తోంది.

దేశ వ్యాప్తంగా అటోమొబైల్ సేవలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.

ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అప్లికేషన్‌ ఆధారిత వాహన సదుపాయ ప్లాట్‌ఫాంను డిజైన్‌ చేసింది. ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఇంటి వద్దకే అన్ని వాహనాల రిపేరింగ్ సేవలను అందించేందుకు రిపేర్ యాప్ ను తీసుకువచ్చింది.

టూ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ నిర్వహణ అవసరాలు అన్నిటికీ ఒక పరిష్కారం అందించడానికి రిపేర్‌ యాప్ దోహదపడుతుందని ఫౌండర్ రామకౌండిన్య తెలిపారు.
డిజిటల్‌ చెల్లింపులు, రియల్‌ టైమ్‌ ట్రాకింగ్‌, ఆర్టర్‌ స్టేటస్‌, నిర్దిష్ట సేవలు పొందడానికి ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుందన్నారు. ఆటోమొబైల్‌ పరిశ్రమలోని ప్రస్తుత యాప్‌లతో పోల్చితే కొన్ని విలక్షణ ఫీచర్లు రిపేర్ ష్లాట్‌ఫాంలో ఉన్నాయని తెలిపారు. సేవల నాణ్యతను పెంచడం,సేవలు అందించేవారికి, వినియోగదారులకు మధ్య మంచి సంబంధాలు ఏర్పరిచి పరస్పర విశ్వాసం పెంచడానికి ఈ ఫాట్ల్ ఫాం ఉపయోగపడుతుందన్నారు.

భారతదేశం ఆటోమొబైల్‌ రంగంలోనూ స్టార్టప్ సేవలు అందించాలనే ఉద్దేశ్యం తో రిపేర్ సేవలను 2019లో పి. రామకౌండిన్య ప్రారంభించారు. 2020 లో రిపేరొ సంస్థ “రిపేరొ ద్విచక్రవాహనాల సేవలను హైదరాబాద్‌లోను, చుట్టుప్రక్కల ప్రాంతాల్లోను ప్రారంభించిందని రామ కౌండిన్య తెలిపారు.

హైదరాబాద్ బాలానగర్ లోని స్మార్ట్ ల్యాబ్స్ కార్యాలయంలో రిపేర్ యాప్ సేవలను విస్తరించేందుకు రూపొందించి లోగోను స్మార్ట్ ల్యాబ్స్ ఎండీ సత్య ప్రసాద్ తో కలిసి ఫౌండర్ రామకౌండిన్య ఆవిష్కరించారు.

2020లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ “రిపేరొ అనతికాలంలోనే కోవిడ్‌
సంక్షోభాన్ని అనుకూలంగా మలుచుకుని ద్విచక్ర వాహనాలకు ఇంటి వద్ద సేవలను (హైదరాబాద్‌లో ఇటువంటి సేవలు ప్రారంభించిన తొలి సంస్థ) ప్రారంభించింది.వినియోగదారుల సూచనల మేరకు ఈ సర్వీసులను ప్రారంభించింది. కోవిడ్‌-19 కారణంగా భారత ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల కారణంగా వైరస్‌ భయం మూలంగా వాహన సేవలు కావలసిన అనేకమంది ప్రజలు ప్రత్యక్షంగా సర్వీసు ప్రొవైడర్లను సంప్రదించలేకపోయారు. ఈ కాలంలో ప్రజల ఇబ్బందులను గ్రహించి, మా సంస్థ ఇంటి వద్దకే వాహన సేవలను ప్రారంభించిందని రామకౌండిన్య తెలిపారు. నెలల తరబడి ఉపయోగించని వాహనాల సమస్యలను కోవిడ్‌ ప్రోటోకాల్‌ను పాటిస్తూ మా టెక్నీషియన్లతో పరిష్కరించామన్నారు.

వాహన రిపేరు రంగంలో గల అపార అవకాశాలు గుర్తించామన్నారు. మొదట్లో ఒక్క మెకానిక్‌ కూడా లేని “రిపేర్‌” బృందంలో ఇప్పుడు హైదరాబాద్‌ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 20 మంది మెకానిక్‌లు చేరారని ఆయన వెల్లడించారు. 2020లో తొలి లాక్‌డౌన్‌ కాలంలో ఇంటి వద్దకే వాహన సేవలను ప్రారంభించామని.. ప్రస్తుతం రోజుకి 40-50 టూవీలర్లకు నెలకు 800-1000 టూవీలర్లకు సర్వీసును అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

టూ వీలర్‌ కస్టమర్లు తమ ఫోర్‌ వీలర్లకు ఇంటి వద్ద సేవలు అందించాలని అభ్యర్థించారని ఫౌండర్ రామకౌండిన్య తెలిపారు. రెండో దశ ఉప ద్రవ కాలంలో ఫోర్‌ వీలర్లకు కూడా ఇంటి వద్ద సేవలను ప్రారంభించామన్నారు.ఫోర్‌వీలర్ల సేవలు ప్రారంభించిన 2 నెలల్లోనే ఇప్పటి వరకు 120-140 ఫోర్‌వీలర్లకు హైదరాబాద్‌లో సేవలు అందించామన్నారు. కస్టమర్ల రిఫరెన్స్‌ల ద్వారానే టూ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ సర్వీసులను వారి ఇళ్ల వద్దనే వారి కళ్ల ముందే సర్వీసులు
అందించామన్నారు.

ఇటువంటి సర్వీసులు అందించవలసిందిగా మా పని పరిధిలో లేని వారు కూడా కోరుతున్నారని.. అందువల్ల ఇతర ప్రాంతాల్లో కూడా సేవలు విస్తరించేందుకు ఫ్రాంచైజ్‌ ప్రాతిపదికన “రిపేర్‌”ను విస్తరిస్తున్నామని చెప్పారు. అప్పుడప్పుడు మెయింటెనెన్స్‌ సర్వీసులతో సరిపెట్టకుండా వాషింగ్‌, ఇంటర్నల్‌ ఎక్స్‌టర్నల్‌ డిటైలింగ్‌, బేక్‌డౌన్‌, టూవీలర్‌, ఫోర్‌వీలర్‌ టైర్లు / బ్యాటరీల సర్వీసులను అందించబోతున్నట్లు వెల్లడించారు. వచ్చే కొన్ని నెలల్లోనే మా ఫ్రాంచైజ్‌ సర్వీసు మోడల్స్‌ను పాన్‌ ఇండియా అంతటా ప్రారంభించబోతున్నామన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి 20 మందికి పైగా సిబ్బంది ఇప్పటికే పనిచేస్తున్నారని చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *