కోవిద్ నిబంధనలతో ప్రారంభమైన వండర్‌లా హైదరాబాద్ పార్క్
హైదరాబాద్
భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ వండర్‌లా హైదరాబాద్ పార్క్‌ను పునః ప్రారంభించింది. ఈ పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా, వండర్‌లా ఇప్పుడు పరిమిత కాలపు ఆఫర్‌ను అందిస్తుంది. దీనిలో భాగంగా పార్కును సందర్శించిన సందర్శకులు రోజంతా పూర్తి వినోదాన్ని కేవలం 799 రూపాయలకు (జీఎస్‌టీ తో సహా) ఆస్వాదించడంతో పాటుగా అన్ని ల్యాండ్, వాటర్ రైడ్స్‌నూ పొందవచ్చు. ఈ థీమ్ పార్కును గురువారం నుంచి ఆదివారం వరకు ఉదయం 11 గంటల నుంచి పార్కు తెరిచి ఉంచబడుతుందని వండర్ లా మేనేజింగ్ డైరెక్టర్,అరుణ్ కె చిట్టిలాపిళ్లై తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించడంతో పాటుగా అత్యుత్తమ ప్రక్రియలను అనుసరిస్తున్న వండర్‌లా, సందర్శకులు తమ ప్రవేశ టిక్కెట్లను ముందుగానే bookings.wonderla.com వద్ద బుక్ చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రభుత్వంతో పాటుగా ఆరోగ్యమంత్రిత్వ శాఖ జారీచేసిన అవసరమైన మార్గదర్శకాలన్నీ కూడా వండర్‌లా హైదరాబాద్ అనుసరిస్తుందన్నారు. ఈ పార్కులో 50 శాతం సామర్థ్యంతో మాత్రమే కార్యకలాపాలు సాగిస్తుందని ,బ్యూరో వెరిటాస్ ఇండియా నుంచి కోవ్–సేఫ్ ధృవీకరణను అందుకున్న మొట్టమొదటి అమ్యూజ్‌మెంట్ పార్క్‌గా వండర్‌లా నిలిచిందన్నారు.
ఆగస్టు 12వ తేదీన మా బెంగళూరు పార్క్‌ను తెరువనున్నామని చెప్పారు. అన్ని భద్రతా చర్యలనూ అనుసరిస్తూ, మా పార్కు వద్దకు అతిథులను స్వాగతించేందుకు మేము పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని చెప్పారు. మా సిబ్బంది అందరికీ వ్యాక్సిన్‌లను అందించడంతో పాటుగా మాస్కులను ధరించడం తప్పని సరి చేశామని అరుణ్ తెలిపారు.