సమ్మెకు దిగిన హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు

హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు. జీతాలు పెంచాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న.. ఉద్యోగులు ఇవాళ విధులు బహిష్కరించారు. ఎల్బీ నగర్-మియాపూర్ మార్గంలో టికెట్లు ఇచ్చే కౌంటర్లలో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. దీంతో మెట్రోస్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్లుగా తమకు జీతాలు పెంచలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమీర్ పేట్ మెట్రోస్టేషన్ వద్ద ఉద్యోగులు సమావేశమై తమ సమస్యలు, డిమాండ్ల గురించి చర్చిస్తున్నారు. వెంటనే దీనిపై స్పందించక పోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.