తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ సూచన ,హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు – పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ సుమారు 18°N అక్షాంశం వెంబడి సముద్ర మట్టానికి 4.5 కి మీ నుండి 5.8 కి మీ మధ్య ఉన్నది ఈ రోజు బలహీన పడినదని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1కి మీ నుండి 7.6కి మీ ఎత్తు మధ్య కొనసాగుతూ నైరుతి దిశగా వంపు తిరిగి వుందని తెలిపింది. దీని ప్రభవంతో రాగల 48గంటలలో వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ సూచన (Weather Forecast)
రాగల 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వాతావరణ హెచ్చరికలు:(weather warnings)
రాగల 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షములతో పాటు అత్యంత భారీ వర్షములు తెలంగాణాలో ఒకటి రెండు ప్రదేశములలో కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉందని తెలిపింది.
అతి భారీ , అత్యంత భారీ వర్షములు ఒకటి ,రెండు చోట్ల ఈశాన్య, తూర్పు తెలంగాణా జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.
వచ్చే 3 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం 30 నుండి 40 కి మీ)తో కూడిన వర్షములు రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.