హైదరాబాద్ నోవాటెల్ లో ఘనంగా హై బిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ ప్రధానోత్సవం
హైదరాబాద్ నోవాటెల్ లో ఘనంగా హై బిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ ప్రధానోత్సవం
ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి
హాస్పిటాలిటీ రంగంలో 50కి పైగా కేటగిరీల్లో ఫుడ్ అవార్డ్స్ ప్రదానం చేసిన హై బిజ్ టీవీ
హైదరాబాద్, ఆగస్ట్ – 2022:
తెలంగాణ వంటకాల రుచులు అందిస్తున్న గల్లీ స్థాయి నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్,వ్యక్తులకు అవార్డులతో సత్కరించడం అభినందనీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు .హైదరాబాద్ హెచ్ఐసీసీలో హైబిజ్ టీవీ ఫుడ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యాపార రంగానికి సంబంధించిన వార్తలను ప్రజలకు అందించే ఉద్దేశంతో 13 ఏళ్ల కిందట హై బిజ్ టీవీ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఇదెంతో ప్రోత్సాహాన్ని ఇస్తోందని చెప్పారు. హైబిజ్ టీవీని విజయవంతంగా నిర్వహిస్తున్న ఎండీ మాడిశెట్టి రాజ్ గోపాల్ ను కిషన్ రెడ్డి అభినందించారు. హై బిజ్ టీవీ నిర్వహించే కార్యక్రమాలకు తాను తప్పకుండా హాజరవుతానని గుర్తు చేసుకున్నారు. పర్యాటక, హోటల్స్ రంగానికి రాబోయే రోజుల్లో చక్కటి భవిష్యత్ ఉందని చెప్పారు.
హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది బిర్యానీ, చాయ్, ఉస్మానియా బిస్కెట్స్, హలీమ్ అని కిషన్ రెడ్డి చెప్పారు. ఇండియా లో ఎక్కడ దొరకని ఫుడ్ మన హైదరాబాద్ లో దొరుకుతుందని తెలిపారు. హై బిజ్ టీవీ గత పదమూడు ఏళ్ళుగా ఫుడ్ కు సంబంధించి వేలాది వీడియోలు రూపొందించి ప్రజలకు చూపించడం ఒక గొప్ప విషయమని కొనియాడారు. అన్ని రకాల హోటల్స్, రెస్టారెంట్లను ఒక్క తాటిపై తెచ్చి వాళ్లను గుర్తించి ఇలాంటి అవార్డులను ప్రదానం చేయడం ఒక మంచి ఆలోచన అని ప్రశంసించారు. అలాగే ఈ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడి ప్రజలకు మంచి భోజనాన్ని అందిస్తున్న వారికి లెజెండ్ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయమని చెప్పారు. భవిష్యత్ లో కూడా హై బిజ్ టీవీ ఇలాంటి పురస్కారాలను ఇవ్వాలని ఆకాంక్షించారు.
పురస్కారాల్లో భాగంగా 50కి పైగా కేటగిరీల్లో ఫుడ్ అవార్డ్స్ ను హై బిజ్ టీవీ అందజేసింది. హాస్పిటాలిటీ రంగంలో అమూల్యమైన సేవలను అందించిన పలువురు లెజెండ్స్ ను సత్కరించింది. హాస్పిటాలిటీ రంగంలోని వ్యక్తులు, బ్రాండ్లు, ఔట్ లెట్లకు హై బిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ మరింత గుర్తింపును ఇవ్వనున్నాయి. వాటి మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొనేందుకు దోహదపడనున్నాయి.
కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. పద్మశ్రీ డాక్టర్ పద్మజా రెడ్డి కాకతీయం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
సుచిరిండియా అధినేత లయన్ డాక్టర్ వై. కిరణ్ జెమిని ఎడిబుల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సినియర్ వైస్ ప్రసిడెంట్ పి. చంద్రశేఖర రెడ్డి శ్రీనివాస ఫార్మ్స్ రిటైల్ బిజినెస్ హెడ్ హర్ష చిట్టురి, కంట్రీక్లబ్ ఇండియా ఛైర్మన్ అండ్ ఎండీ వై. రాజీవ్ రెడ్డి సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఎండీ వేణు వినోద్ ,తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ ఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, హై బిజ్ టీవీ అండ్ తెలుగు నౌ ఎండీ మాడిశెట్టి రాజ్ గోపాల్, హై బిజ్ టీవీ , తెలుగు నౌ సీఈవో డాక్టర్ జె. సంధ్యారాణి,నటి పూర్ణ, విస్ ఇండియా వరల్డ్ మానస వారణాసి తదితరులు పాల్గొన్నారు.