భావి తరపు ఐకానిక్‌ భారతీయ రైడర్‌ కోసం వెదుకులాటను పునరుద్ధరించిన హోండా 2 వీలర్స్‌ ఇండియా

ఔత్సాహిక యువ రేసింగ్‌ ప్రతిభావంతులను గుర్తించడం కోసం హైదరాబాద్‌ చేరుకున్న ఇడెమిట్సు హోండా ఇండియా టాలెంట్‌ హంట్‌ 2021 రౌండ్‌ 3

ప్రపంచంలోని యువ రైడర్లను గుర్తించడం ,రేసింగ్‌ కెరీర్‌ను వేగవంతం చేయడం హోండా యొక్క వినూత్నమైన వేదిక లక్ష్యంగా చేసుకుంది.

మొదటి దశలో 16 సంవత్సరాలకు పైబడిన వయసు కలిగిన 8 మంది యువ రైడర్లు తమ ప్రతిభను చాటారు

షార్ట్‌లిస్ట్‌ చేయబడిన ఐదుగురు అభ్యర్ధులు ఫేజ్‌2 కోసం ప్రమోట్‌ చేయబడ్డారు. అక్కడ వారికి ప్రొఫెషనల్‌ రేసింగ్‌ శిక్షణ మరియు రైడింగ్‌ పరీక్షలకు వెళ్లనున్నారు

ఎంపిక చేయబడిన రైడర్లు నేరుగా ఇడెమిట్సు హోండా ఇండియా టాలెంట్‌ కప్‌ 2022– సీబీఆర్‌ 150 ఆర్‌ క్లాస్‌ కు అర్హత సాధించగలరు

హైదరాబాద్‌, 22 ఫిబ్రవరి 2022 : ప్రొఫెషనల్‌ రేసింగ్‌ ప్రపంచంలో ప్రవేశించాలని తపన పడే భావితరపు రైడర్ల ఆశలకు రెక్కలు తొడుగుతూ హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ ముందుకు వ‌చ్చింది. యువ రేసింగ్‌ ప్రతిభను కనుగొనడం కోసం తమ వెదుకులాటను పునరుద్ధరించింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని చికెన్‌ సర్క్యూట్‌ వద్ద ఇడెమిట్సు హోండా ఇండియా టాలెంట్‌ హంట్‌ 2021 రౌండ్‌ 3 పోటీలను నిర్వహించింది. మూడవ రౌండ్‌ ఇడెమిట్సు హోండా ఇండియా టాలెంట్‌ హంట్‌ 2021ను హైదరాబాద్‌లో నిర్వహించగా ఎనిమిది మంది ఔత్సాహిక రైడర్లు పాల్గొన్నారు. తెలంగాణాలోని హైదరాబాద్‌ , జనగాం, మంచిర్యాల్‌తో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, వైజాగ్ , ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హర్దోయ్‌ వంటి ఆరు నగరాలకు చెందిన రైడ‌ర్లు పాల్గొన్నారు. . ఈ రౌండ్‌లో 16–17 సంవత్సరాల వయసుల ప్రతిభావంతులు పాల్గొన్నారు. వీరంతా కూడా ఐకానిక్‌ రైడర్‌గా తమ సత్తా చాటేందుకు ఓ వేదిక కోసం పరితపిస్తున్నారు .

హైదరాబాద్‌లో పాల్గొన్న అభ్యర్థులను గురించి శ్రీ ప్రభు నాగరాజ్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌– బ్రాండ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ , హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘ఇడెమిట్సు హోండా ఇండియా టాలెంట్‌ హంట్‌ను హోండా అభివృద్ధి చేసింది . భారతదేశ వ్యాప్తంగా ఔత్సాహిక మరియు ఆసక్తికలిగిన యువ రైడర్లకు ఓ వేదికను అందించడంతో పాటుగా రేస్‌ ట్రాక్‌పై వారి సామర్థ్యం ప్రదర్శించుకునే అవకాశమూ అందిస్తుంది. మేము 2021 హంట్‌ను తరువాత తరపు రేసింగ్‌ సెన్సేషన్‌ కోసం చెన్నైలో ప్రారంభించాము. అక్కడ ఇద్దరు రైడర్లను షార్ట్‌లిస్ట్‌ చేశాము. వారు 2021 ఇడెమిట్సు హోండా ఇండియా టాలెంట్‌ కప్‌ సీబీఆర్‌ 150ఆర్‌ వద్ద అసాధారణ ప్రదర్శన కనబరిచారు. హైదరాబాద్‌లోని ఈ రౌండ్‌తో మేము మరింత ముందుకు వెళ్లడంతో పాటుగా ఫేజ్‌ 2 కోసం ఐదుగురు అభ్యర్ధులను ఎంపిక చేశాము. ఈ రైడర్లలో అత్యుత్తమ సవారీ నైపుణ్యాలను ప్రదర్శించిన వారికి 2022 సీజన్‌ ఇడెమిట్సు హోండా ఇండియా టాలెంట్‌ కప్‌ సీబీఆర్‌ 150ఆర్‌ సీజన్‌ మొత్తం పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇది కేవలం వారి ప్రొఫెషనల్‌ కెరీర్‌ ఆరంభం. దీర్ఘకాలంలో, హోండా యొక్క లక్ష్యం, ప్రతిభావంతులైన భారతీయ రైడర్లకు పలు జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలైనటువంటి ఆసియా టాలెంట్‌ కప్‌, ఆసియా రోడ్‌ చాంఫియన్‌షిప్‌, ఎండ్యూరెన్స్‌ చాంఫియన్‌షిప్‌లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ఔత్సాహిక రైడర్లు భారతీయ మోటర్‌స్పోర్ట్స్‌ వాతావరణాన్ని సమూలంగా మార్చగలగడమే కాదు, జాతీయ మరియు అంతర్జాతీయ స్ధాయిలో జాతికి గర్వకారణంగా కూడా నిలువగలరు’’ అని అన్నారు.
మొదటి దశలో , 8 మంది అభ్యర్ధులు మూడు దశల పోటీలను ఎదుర్కొంటారు. మొదటిది శారీరక ధారుడ్య పరీక్ష కాగా అనుసరించి యువ ప్రతిభావంతుల రైడింగ్‌ నైపుణ్యాలను సైతం పరీక్షించడంతో పాటుగా రేస్‌ ట్రాక్‌పై వారి ప్రతిభను పరీక్షించనున్నారు. దీనిని అనుసరించి అభ్యర్థులతో పాటుగా వారి తల్లిదండ్రులు/సంరక్షకులతో ముఖాముఖి ఇంటర్వ్యూలను నిర్వహించడంతో పాటుగా మోటర్‌ స్పోర్ట్స్‌ పట్ల వారి అభిరుచి, భారతదేశం నుంచి ఐకానిక్‌ రైడర్‌గా మారేందుకు అవసరమైన కుటుంబ మద్దతును తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
మొదటి దశలో ఐదుగురు అభ్యర్ధులను షార్ట్‌ లిస్ట్‌ చేసిన తరువాత వీరికి శిక్షణ అందిస్తారు మరియు ఫేజ్‌ 2లో ట్రాక్‌పై సవారీ చేసే అవకాశమూ అందిస్తారు. ఈ ప్రతిభావంతుల నుంచి హోండా అత్యుత్తమ ప్రతిభను భవిష్యత్‌ అభివృద్ధి కోసం ఎంచుకుంటుంది. ఎంపిక కాబడిన ఈ రైడర్లకు 2022 ఇడెమిట్సు హోండా ఇండియా టాలెంట్‌ కప్‌ సీబీఆర్‌ 150ఆర్‌ విభాగంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
ఇడెమిట్సు హోండా ఇండియా హంట్‌ గురించి…
2018లో ప్రారంభించిన, ఇడెమిట్సు హోండా ఇండియా టాలెంట్‌ హంట్‌ ద్వారా రేసింగ్‌ ప్రపంచంలో ప్రవేశించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ దానిలో ప్రవేశించేందుకు తగిన మార్గనిర్దేశకత్వం లేక సతమతమవుతున్న ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా చేసుకుంది. హోండా2 వీలర్స్‌ ఇండియా ప్రారంభించిన మొట్టమొదటి కార్యక్రమం ఔత్సాహిక రేసర్లకు తగిన వేదికను అందించడంతో పాటుగా తమ కెరీర్‌ ఆరంభంలో తమ సామర్థ్యం ప్రదర్శించుకునే అవకాశం అందిస్తూనే వారి నైపుణ్యాలను పెంచుకునే అవకాశమూ అందిస్తుంది. ఈ కార్యక్రమం అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. 2018 ఇడెమిట్సు హోండా ఇండియా టాలెంట్‌ హంట్‌ ద్వారా చెన్నై నుంచి కెవిన్‌ క్వింటాల్‌ను కనుగొనడం జరిగింది. అతనికి ప్రొఫెషనల్‌ రేసింగ్‌లో మూడు సంవత్సరాల అనుభవం లభించడంతో పాటుగా 2022 ఇడెమిట్సు ఆసియా టాలెంట్‌ కప్‌ (ఐఏటీసీ) లాంటి అంతర్జాతీయ వేదికలలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *