హెచ్ఎండిఏ ఈ వేలం ప్రక్రియకు ఆదరణ
మొదటి రోజు 85 ప్లాట్ లకు గాను 73 ప్లాట్ల విక్రయం
తుర్కయంజాల్ లో అత్యధికంగా గజం రూ.62, 500లు
బహుదూర్ పల్లిలో అత్యధికంగా గజం రూ.42,000లు
హైదరాబాద్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి గురువారం నిర్వహించిన ఆన్ లైన్ ప్లాట్ల వేలం ప్రక్రియలో కొనుగోలుదారులు అత్యంత ఆసక్తి కనబరిచారు.
గురువారం రెండు సెషన్లలో రాత్రి వరకు జరిగిన ఆన్ లైన్ వేలంలో మొత్తం 85 ప్లాట్లకు కు జరిగిన ఈ ఆక్షన్ లో 73 ప్లాట్లు బిడ్డర్లు కోనుగోలు చేశారు.
బహుదూర్ పల్లి, తుర్కయంజాల్ లలో హెచ్ఎండిఏ వెంచర్ల ముందు నుండి అత్యంత డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.
బహుదూర్ పల్లి వెంచర్ లో 51 ప్లాట్ల గాను 50 ప్లాట్లు గురువారం వేలంలో అమ్ముడుపోయాయి. బహుదూర్ పల్లి వెంచర్ లో గజం రూ.25,000/- నిర్ణయించగా అత్యధికంగా గజం రూ.42, 500ల ధర పలికింది. అత్యల్పంగా రూ.29,000 ల ధరకు కొనుగోలుదారులు ధర కోట్ చేసి సొంతం చేసుకున్నారు.
తుర్కయంజాల్ వెంచర్ లో 34 ప్లాట్లకు గాను 23 ఫ్లాట్ లకు బిడ్ చేసి ఔత్సాహికులు కొనుగోలు చేశారు ఇక్కడ గజం రూ.40000ల ధర నిర్ణయించగా అత్యధికంగా రూ.62,500లు అత్యల్పంగా రూ.40, 500ల వరకు అమ్మకాలు జరిగాయి.గురువారం జరిగిన ఆన్ లైన్ ద్వారా రూ.137.65 కోట్ల విలువచేసే ప్లాట్ల అమ్మకాలు జరిగాయి.