బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ
హైదరాబాద్ ,బంజారాహిల్స్
మట్టి వినాయకల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన పెరగడం సంతోషకరమైన విషయమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు .హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో బాలయ్య పాల్గొన్నారు .
హాస్పిటల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన గణనాధుడికి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు .పూజ అనంతరం ప్రసాద వితరణ చేశారు .ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలెదుర్కొంటున్న విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ తో పాటు BIACH&RI సీఈఓ డాక్టర్ ఆర్ వి ప్రభాకర రావు, , మెడికల్ సూపర్నింటెండెంట్ డాక్టర్ ఫణి కోటేశ్వర రావులతో పాటూ హాస్పిటల్ కు చెందిన వైద్యులు, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందు హాస్పిటల్ ఆవరణలో ఉన్న గణేష్ మందిరంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.