హైదరాబాద్ నోవాటెల్ లో ఈ నెల 29,30 వ తేదీలలో హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్

హైదరాబాద్, బంజారాహిల్స్.

వకీల్ సాబ్ హీరోయిన్ అనన్య నాగేళ్ళ భాగ్యనగరంలో సందడి చేసింది.

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మార్క్స్ మీడియా కార్యాలయంలో హైలైఫ్ కర్టన్ రైజర్ ఈవెంట్ లో నాగేళ్ళ అనన్య తలుక్కుమంది .

ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్న హై లైఫ్ ఎగ్జిబిషన్ పోస్టర్ ను మోడల్స్ తో కలిసి అనన్య నాగేళ్ళ అవిష్కరించారు. ఈ నెలాఖరున 29,30 వ తేదీలలో హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీ లో హైలైఫ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

దేశ వాప్తంగా ఉన్న సుమారు 300 మంది డిజైనర్లు తయారు చేసిన వస్త్రఉత్పత్తులు, బంగారు వజ్రాభరణాలు, ఇంటి అలంకరణ సామాగ్రి ,తదితర ఉత్పతులను ఈ ప్రదర్శనలో కొలువుదీరనున్నట్లు ఆమె తెలిపారు .

ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నానని …త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయని అనన్య తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *