హైదరాబాద్ నోవాటెల్ లో హై లైఫ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన హీరోయిన్ శ్రద్ధాదాస్ , బిగ్ బాస్ ఫేం లహరి
హైదరాబాద్ ,కొండాపూర్
పండుగలు, పెళ్ళిళ్ళు,శుభకార్యాలను పురస్కరించుకుని నగరంలో ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ల జోరు కొనసాగుతుంది. దేశంలోని ప్రముఖ యువ డిజైనర్లు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులన్నింటినీ ఒకే వేదికపై తీసుకువస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ బ్రాండ్ హై లైఫ్ వాలంటైన్స్ ఇన్ స్ప్రైడ్ ట్రెండ్స్ పేరుతో న్యూ ఎడిషన్ ను ప్రారంభించింది.
వాలంటైన్స్ డే రోజున అద్బుతమైన డిజైనర్ దుస్తులు… మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వండి అనే ట్యాగ్ లైన్ తో హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ముందుకు వచ్చింది.హైదరాబాద్ నోవాటెల్ లో ఈ నెల 13 , 14, 15 వ తేదీలలో ఈ ఎగ్జిబిసన్ అందుబాటులో ఉంటుందని హై లైఫ్ ఎండీ, సీఈఓ ఏబీ డొమినిక్ తెలిపారు .
హైదరాబాద్ నోవాటెల్ లో మూడు రోజుల పాటు జరిగనున్న ఈ హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ను హీరోయిన్ శ్రద్ధాదాస్ , బిగ్ బాస్ ఫేం లహరి మోడల్స్ తో కలిసి ప్రారంభించారు .దేశంలోని ప్రముఖ డిజైనర్లు తమ సృజనాత్మకతతో రూపొందించిన వస్త్ర ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచారు. వాలంటైన్స్ డే ను పురస్కరించుకుని లవర్స్ కోసం స్పెషల్ డిజైనరీ కలెక్షన్స్ అందుబాటులో ఉంచినట్లు ఆమె తెలిపారు .
ఫ్యాషన్ ప్రియుల కోసం , ప్రేమికుల కోసం ప్రత్యేక కలెక్షన్స్ ప్రదర్శనలో ఉంచినట్లు శ్రద్ధాదాస్, లహరి తెలిపారు. లేటెస్ట్ ట్రెండ్స్ అనుగుణంగా ఫ్యాషన్ కలెక్షన్స్ ఈ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంచినట్లు హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఎండీ ,సీఈఓ డొమినిక్ తెలిపారు .హైదరాబాదీయులు ఫ్యాషన్ ప్రియులన్నారు .గతంలో సంవత్సరానికి రెండు మూడు సార్లు మాత్రమే ఎగ్జిబిషన్ నిర్వహించేవారమని…ఈ సారి రెండు నెలలకు ఒకసారి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు డొమినిక్ తెలిపారు . డిజైనర్ వేర్, ఫ్యాషన్ వేర్, బ్రైడల్ వేర్, ఆభరణాలు, ఉపకరణాలు, అత్యుత్తమ సేకరణలు ఇంకా ఎన్నో కలెక్షన్స్ అందుబాటులో ఉంచామని తెలిపారు .