హైదరాబాద్ తాజ్ కృష్ణాలో పింక్ డిజైర్ డిజైనరీ ఎగ్జిబిషన్ ప్రారంభించిన హీరోయిన్ సహస్ర్త రెడ్డి
హైదరాబాద్ బంజారాహిల్స్
ఫ్యాషన్ ప్రియుల కోసం వాలంటైన్స్ డే కలెక్షన్స్ తో పింక్ డిజైర్ డిజైనరీ ఎగ్జిబిషన్ వచ్చేసింది.హైదరాబాద్ తాజ్ కృష్ణాలో పింక్ డిజైర్ పేరుతో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను వర్థమాన సినీ నటి సహస్త్ర రెడ్డి మోడల్స్ తో కలిసిప్రారంభించారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు అంతా కలిసి ఒకే చోట తమ వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం అభినందనీయమని సినీ నటి సహస్ర రెడ్డి అన్నారు . రానున్న పండుగలు, పెళ్ళిళ్ళ, వాలంటైన్స్ డే తదితర అకేషన్స్ కు కావాల్సిన అన్నిరకాల డిజైనరీ వస్త్రాలను ఈ ఎగ్జిబిషన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆర్గనైజర్ అనిత అగర్వాల్ తెలిపారు .
డిజైర్ ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ 8,9, 10 వ తేదీన హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో ప్రదర్శించబడుతోందని ఆమె తెలిపారు .ది పింక్ డిజైర్- డిజైనర్ ఎగ్జిబిషన్” లో కోవిడ్-19 ప్రోటోకాల్‌లు ,మార్గదర్శకాలు కట్టుబడి ఉన్నాయని డిజైర్ డిజైనర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ అనితా అగర్వాల్ తెలిపారు.