హైదరాబాద్ కూకట్ పల్లిలో ముగ్ద ఆర్ట్ స్టూడియోను ప్రారంభించిన హీరోయిన్ కీర్తీ సురేష్
టెంపుల్ థీమ్ స్టోర్ ముగ్ధలో సందడి చేసిన కీర్తీ సురేష్
ప్రతి అందానికి ప్రతి బంధానికి ముగ్ధ….
ముగ్ధ సరికొత్త కంచి పట్టు ప్రపంచానికి స్వాగతం
హైదరాబాద్ ,కూకట్ పల్లి
టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ శశి వంగపల్లి తన ముగ్ధ ఆర్ట్ స్టూడియోను కూకట్ పల్లిలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్ స్టూడియో ఫ్యాషన్ ప్రియుల ఆదరాభిమానాలను పొందింది. తాజాగా కూకట్ పల్లి వాసులకు చేరువ అయ్యేందుకు కూకపల్లి నిజాంపేట్ వద్ద ముగ్ధ డిజైనరీ స్టూడియోను ఏర్పాటు చేసింది.
సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోడిజైనర్ శశి వంగపల్లి పట్టు వస్త్రాలను తీసుకురావడం అభినందనీయమని సినీ నటి కీర్తి సురేష్ అన్నారు.ముగ్ధ డిజైనరీ స్టూడియోలో ఎంతో అందమైన పట్టు చీరలు అందుబాటులో ఉంచారని ఆమె తెలిపారు . పెళ్ళిళ్ళి, శుభకార్యాలకు కావాల్సిన అన్ని రకాల పట్టు వస్త్ర ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు . ముగ్ధ తో తాను అసోసియేట్ కావడం ఎంతో సంతోషంగా ఉందని కీర్తీ సురేష్ తెలిపారు .
కూకట్ పల్లిలోని తమకు చాలా మంది సన్నిహితులు ,క్లయింట్స్ ఉన్నారని…వారి కోసం టెంపుల్ థీమ్ ముగ్ధ ఆర్ట్ స్టూడియోను ప్రారంభించినట్లు డిజైనర్ శశి వంగపల్లి అన్నారు .టెంపుల్ థీమ్ స్టోర్ అనేది ముగ్ధ స్టోర్స్‌కి మాత్రమే ప్రత్యేకమన్నారు.భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ స్టూడియోను తీర్చిదిద్దినట్లు ఆమె చెప్పుకొచ్చారు. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలొ పట్టువస్త్ర ఉత్పత్తులను అందిస్తున్నామని తెలిపారు .డిజైన్లు, దుస్తుల నాణ్యత రెండింటి పరంగానూ మా కస్టమర్లకు ఉత్తమమైనవే అందివ్వాలని ఆశిస్తామన్నారు.