చందానగర్ పవన్ మోటార్స్ లో మారుతి సుజికి బ్రీజా కారును ఆవిష్కరించిన హీరో తేజ సాజ్ఞ
సామాన్య మధ్యతరగతి ప్రజలకుఅందుబాటు ధరలో మారుతి సుజికి బ్రీజా కారును తీసుకురావడం సంతోషంగా ఉందని హీరో తేజ సాజ్ఞ అన్నారు .రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ పవన్ మోటార్స్ లో మారుతి సుజికి బ్రీజా కారును నటుడు తేజ సాజ్ఞ ఆవిష్కరించారు. మధ్యతరగతి కుటుంబాలు ,యువతను ఆకట్టుకునేలా కొత్త బ్రీజా కారును మారుతి సుజికి సంస్థ తీర్చిదిద్దిందన్నారు .తన చేతుల మీదుగా బ్రీజా కారును ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు .
పవన్ మోటార్స్ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, ఎం.డి. చంద్ర పవన్ రెడ్డి, బిసినెస్ మార్కెటింగ్ హెడ్ రవి కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేడిన్ ఇండియా కాన్సెఫ్ట్ తో తీసుకువచ్చిన ఈ కారుకు కస్టమర్ల నుంచి మంచి స్పందన ఉందన్నారు .ఈ కారులో లేటెస్ట్ ఫీచర్లతో పాటు 360 డిగ్రీ కెమెరా తీసుకువచ్చినట్లు వారు తెలిపారు .ఈ బ్రీజా కార్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని షోరూంలో పనిచేసే క్రింది స్థాయి సిబ్బందికి లబ్ది చేకూరుస్తామని వారు తెలిపారు .