చైనా వెళ్లాడు.. డేంజరస్ వైరస్ మోసుకొచ్చాడు..!
చైనాలో కరోనా కొత్త వేరియంట్ కల్లోలం సృష్టిస్తోంది. డిసెంబర్ మొదటి 20 రోజుల్లో డ్రాగన్ కంట్రీలో 25కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో భారత్ కూడా అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టుల్లో విదేశీ ప్రయాణికులకు పరీక్షలు చేస్తోంది. తాజాగా చైనా నుంచి యూపీ వచ్చిన 40 ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్ గా తేలింది. సదరు వ్యక్తి చైనా నుంచి రెండు రోజుల కిత్రం ఆగ్రాకు వచ్చాడు. ఓ ప్రైవేటు ల్యాబ్‌లో కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత ఆరోగ్యశాఖ బృందం సదరు యువకుడి ఇంటికి చేరుకొని.. వివరాలు ఆరా తీసింది. మరోవైపు అతడికి సోకింది ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్ BF-7..కాదా అని నిర్ధారించేందుకు నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. ప్రస్తుతం బాధితుడు కారంటైన్ లో ఉంచి కుటుంబ సభ్యులకు టెస్టులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
