తాను ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ వాడలేదు : పోసాని కృష్ణమురళి
హైదరాబాద్
రచయితగా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా, దర్శకుడిగా పోసాని కృష్ణమురళి పేరు తెచ్చుకున్నాడు. మొదట్లో సీరియస్ పాత్రలతో ఎంట్రీ ఇచ్చిప్పటికీ కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సినిమాల్లో ఎప్పుడూ కామెడీ చేసే పోసాని జీవితంలో ఎంతో పెద్ద విషాదం ఉంది. తాజాగా యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న ఓ ప్రోగ్రామ్‌కు వచ్చిన పోసాని ఆ సంఘటనను తలచుకుని ఎమోషనల్ అయ్యాడు.

దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన తండ్రి సుబ్బారావు చిన్నతనంలోనే చనిపోయాడని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చాడు. ఆయనకు ఏ చెడు అలవాట్లు లేవని తెలిపాడు. అయితే ఎవడో ఆయనకు పేకాట ఆడటం నేర్పించాడట. అలా పేకాట ఆడటం చూసిన ఊళ్లో వాళ్లంతా ఏంటి సుబ్బారావు ఇలా చేస్తున్నావేంటి అని అందరూ అడిగేసరికి తనలో తానే ఆలోచించుకున్నాడు. ఆ తర్వాత పొలానికి వెళ్లిపోయి పురుగుల మందు తాగాడు. అక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని సుమ షోలో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మొబైల్ ఫోన్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు తను స్మార్ట్‌ఫోన్ వాడలేదని, చిన్న ఫోన్ మాత్రమే వాడుతున్నట్టు రివీల్ చేశాడు. మరి ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో సుమ ప్రశ్నించగా.. అవి ఎందుకు అంటూ ప్రశ్నించాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారింది.