తెలంగాణలో టీచర్ల జీతాలు ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే..?

తెలంగాణలో జీతాల ఆలస్యానికి కేంద్రమే కారణమని మంత్రి హరీష్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను ఆపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్లే జీతాల చెల్లింపులో ఆలస్యం అవుతోందని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని అన్నారు. ఉద్యోగుల సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. విద్యాశాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఇక రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోందని మంత్రి విమర్శించారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడుతోందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం చెప్పిన రూ. 5 వేల కోట్లను కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని చెప్పారు. దేశంలోనే ఎక్కువ వేతనాలు అందుకుంటున్నది తెలంగాణ ఉపాధ్యాయులని… వారి జీతాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హరీశ్ రావు అన్నారు.

జీతాల ఆలస్యానికి కారణం కేంద్రమే అంటున్న హరీష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *