రాష్ర్ట ప్రజలకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు : సీఎం జగన్

రాష్ర్ట ప్రజలకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు : సీఎం జగన్

శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి సీఎం జగన్ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్ళలో నూతన సంవత్సర శోభను తెస్తూ, కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికి తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.*

శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని; సమృద్ధిగా వానలు కురవాలని; పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, అన్ని వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని సీఎం జగన్ అభిలషించారు.

శోభకృత్ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *