టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో మోస్ట్ ప్రామిసింగ్ ప్లాటెడ్ డెవలపర్స్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు ను అందుకున్న సమూహ ప్రాజెక్ట్స్
హైదరాబాద్ ,మాదాపూర్
హైదరాబాద్ నోవాటెల్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ దిన పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో కనుల పండుగ గా సాగింది.ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ముఖ్య అతిధి గా హాజరై ఆయా రంగాలలో ప్రతిభ కనబర్చిన వ్యక్తులు ,సంస్థల కు అవార్డు లను అందించారు.
సామాన్య మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నిజం చేసేందుకు కృషి చేస్తున్న సమూహ ప్రాజెక్ట్స్ కు ఈ ఏడాది మోస్ట్ ప్రామిసింగ్ ఫ్లాటెడ్ డెవలపర్స్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డ్ లభించింది.
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం వల్లే ఈ అవార్డు లభించిందని సమూహా ప్రాజెక్ట్స్ ఛైర్మెన్ కుర్ర మల్లికార్జున్ అన్నారు. టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ డా” తమిళిసై సౌందర్యరాజన్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అని సమూహ ప్రాజెక్ట్స్ ఛైర్మెన్ కుర్ర మల్లికార్జున్ అన్నారు.