సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌కు శుభం కార్డు ప‌డింది – మెగాస్టార్ చిరంజీవి

‘ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి నిరూపించుకున్నారు.. త్వరలోనే గుడ్‌న్యూస్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తో సినీ ప్రముఖులు భేటీ విజయవంతంగా ముగిసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సినీ ప్రముఖులు మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలకు శుభంకార్డు పడిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని సీఎం జగన్‌ తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
‘విశాఖను సినిమా హబ్‌గా తయారు చేస్తామని సీఎం జగన్‌ అన్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఎలా అయితే అభివృద్ధి చెందిందో ఏపీలో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతాం అని సీఎం జగన్‌ అన్నారు. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ వస్తోంది. ఏ సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకుంటాం. ఈనెల చివర్లో జీవో వచ్చే అవకాశం ఉంది. సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రత్యేక శ్రద్ద వహించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ పేర్ని నానికి ధన్యవాదాలు’ అని మెగాస్టార్‌ చిరంజీవి పేర్కొన్నారు.

చిరంజీవి దారి చూపించారు

‘గత ఆరు, ఏడు నెలలుగా సినీ పరిశ్రమ సందిగ్ధంలో పడిపోయింద‌ని… అలాంటి సమయంలో చిరంజీవి ముందడుగు వేసి మాకు దారి చూపించారని ప్రిన్స్ మ‌హేష్ బాబు అన్నారు .సీఎం జ‌గ‌న్ తో జరిగిన సమావేశం చాలా పెద్ద రిలీఫ్‌ అని చెప్పొచ్చ‌న్నారు. వారం, పది రోజుల్లో గుడ్‌న్యూస్‌ వింటామ‌ని… సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీఎం జగన్‌కు, మంత్రి పేర్ని నానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .

ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి నిరూపించుకున్నారు :

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ధన్యవాదాలు తెలిపారు . సీఎం జ‌గ‌న్ అందరి అభిప్రాయాలు ఎంతో ఓపిగ్గా విన్నారని.. గత కొన్నాళ్లుగా సందిగ్ధంలో ఉన్నసినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు . ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ముఖ్యమంత్రితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని వినియోగించి ఇంత పెద్ద సమస్య పరిష్కారమయ్యేలా కృషి​ చేశార‌ని తెలిపారు . సీఎం జగన్ మా పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని…ప్ర‌భాస్ అన్నారు . ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు . చిన్న సినిమాలకు థియేటర్ దొరికే పరిస్థితి లేదని ఆర్ నారాయ‌ణ మూర్తి అన్నారు . అలాంటి సగటు సినిమాను బతికించాల్సిందిగా సీఎం గారిని కోరామని .. ఎటువంటి సాయం కావాలన్నా చేస్తానని ఆయన హామీ ఇచ్చిన‌ట్లు నారాయ‌ణ మూర్తి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *