బుక్ ఫెయిర్ లో గ్రీన్ ఇండియా చాలెంజ్.. రెస్పాన్స్ అదుర్స్..!

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మొక్కల పంపిణీ అందరినీ ఆకట్టుకుంది. MP సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ కళాభారతీ 35 వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రాంగణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో పుస్తక ప్రేమికులకు మొక్కల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పుస్తక ప్రేమికులకు మొక్కలు అందజేయాలన్న సంకల్పంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి శ్రవణ్ నందివర్ధనం, మల్లె, మందార, ఆక్సిజన్ ప్లాంట్స్ తో పాటు పలు ఔషధ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేస్తున్న కృషిని పుస్తక ప్రేమికులు కొనియాడారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్ కి రెస్పాన్స్ అదుర్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *