స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్

అమరావతి

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

స్వాతంత్ర్య దినోత్సవ వేళ జాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ అంకితం కావాలని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’  జరుపుకుంటున్నామని గుర్తు చేశారు.  స్వాతంత్య్ర ఫలాలను ఆస్వాదించడానికి సుగమం  అయిన ఈ పర దినాన, స్వాతంత్ర్య సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని గవర్నర్ ప్రస్తుతించారు. సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావం వంటి గొప్ప ఆదర్శాలకు  పునః ప్రతిష్ఠ దినంగా ఈ రోజు స్ఫూర్తి నిస్తుందన్నారు.ముసుగు ధరించడం, సామాజిక దూరం పాటించటం, క్రమం తప్పకుండా హ్యాండ్ వాష్ చేయడం ద్వారా కోవిడ్‌  ప్రవర్తనను ఖచ్చితంగా పాటించాలని గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.  మూడవ తరంగ ముప్పు మనపై తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని, కోవిడ్  వ్యతిరేకంగా పోరాటంలో టీకా ఉపయోగకరమైన సాధనంగా ఉండడంతో అర్హత కలిగిన వారంతా టీకాలు ఆలస్యం చేయకుండా వేయించుకోవాలన్నారు.. టీకాలు వేసిన తర్వాత కూడా ముసుగు మొదలైనవి ధరించడం,  కోవిడ్‌కు తగిన ప్రవర్తనను అనుసరించడం తప్పని సరి అన్నారు.
‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ వేడుకలను చిరస్మరణీయంగా మార్చాలని, కోవిడ్ -19 కి వ్యతిరేకంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సమాజాన్ని రక్షించుకోవాలని ప్రజలకు గవర్నర్ మరోసారి విజ్ఞప్తి చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *