ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నర్ అభినందన

విజయవాడ :

పీఎస్‌ఎల్‌వీ సీ-52 అంతరిక్ష నౌక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ మాననీయ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఈ విజయం ప్రస్ఫుటం చేసిందన్నారు. ఈ ప్రయోగం ద్వారా మూడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు మరో రికార్డ్ సాధించారని అభినందించారు. వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం రూపొందించిన ఆర్‍ఐశాట్ -1 ఉపగ్రహంతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. గవర్నరు శ్రీ హరిచందన్ మాట్లాడుతూ భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో ఈ సినిమా విజయం మరో మైలురాయిని అభికమించిందన్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *