ట్రావెల్ ఏజెన్సీ ల కు ప్రభుత్వం సహకారం అందించాలి:టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆర్వీ రమణ
టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆర్వీ రమణ
ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయాన్ని యునెస్కొ గుర్తించడం పట్ల టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంతోషం వ్యక్తం చేసింది. హైదరాబాద్ హరిత ఫ్లాజా హోటల్‌లో టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ బోర్డ్ సమావేశం అయింది.
ఈ సమావేశంలో తెలంగాణలోని ట్రావెల్ ఏజెంట్ల పాల్గొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతున్న రీ స్టాట్ ఫ్యాకేజీ సౌకర్యాన్ని తెలంగాణ ట్రావెల్ ఏజెంట్లకు కల్పించాలని టాట్ ప్రసిడెంట్ ఆర్వీ రమణ డిమాండ్ చేశారు . అంతే కాకుండా ట్రావెల్స్ సంస్థలకు బ్యాంక్ ల నుండి పది లక్షల రూపాయలు రుణాలను మంజూరు చేయాలని తీర్మాణించినట్లు ఆయన వెల్లడించారు .పర్యాటక రంగ అభివృద్దికి టాట్ సంస్థ కృషి చేస్తుందని… తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు . ట్రావెల్ ఏజెన్సీల సమస్యలపై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రామప్ప టెంపుల్ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక రంగ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న ట్రావెల్ ఏజెంట్ లకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందించాలని సభ్యులు డిమాండ్ చేశారు.