సమ్మె సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

హైదరాబాద్ మియాపూర్

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ బస్ డిపో వద్ద అక్టోబర్ 5 వ తేదీన ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల త్యాగాల దినంను ఆర్టీసీ కార్మికులు జరుపుకున్నారు.

టి.ఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మియాపూర్ వన్ డిపోలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల త్యాగాల దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన 38 మంది కార్మికుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. .ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2019 అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె లో 55 రోజుల పోరాటం లో సుమారు 38 మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందని గుర్తు చేశారు.

ప్రభుత్వం ఇప్పటివరకు వారి త్యాగాలను గుర్తించలేదని … ఆనాటి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ విమర్శించారు. .2017 ఏప్రిల్ 1 నుంచి జరగాల్సిన వేతన సవరణ ఇంత వరకూ జరగలేదని.. 2021లో ఏప్రిల్ 1న జరగవలసిన అవసరం ఉందన్నారు. రెండు వేతన సవరణలు జరగవలసి ఉన్నప్పటికీ ఇంతవరకూ ప్రభుత్వం ఆ విషయాల గురించి పట్టించుకోవడం లేదన్నారు. చివరకు కార్మికులకు ఒకటో తేదీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈనాటి ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులను అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ నాయకులు మురళి,ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఈమని వినాయక రెడ్డి ,రాజబాబు, భాస్కర్,అశోక్, మరియు వందలమంది వరకు కార్మికులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *