ఆత్మహత్యలు లేని సమాజాన్ని సృష్టించేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్చంధ సంస్థలు , విద్యా సంస్థల భాగస్వామ్యం అవసరం : మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి
హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్
ఆత్మహత్యలు లేని సమాజాన్ని సృష్టించేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్చంధ సంస్థలు,విద్యా సంస్థలు భాగస్వామ్యం అవసరమని మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి అన్నారు .హైదరాబాద్ వెంగల్ రావు నగర్‌లోని నలంద స్కూల్‌లో పాఠశాల విద్యార్థుల కోసం వన్ లైఫ్ సంస్థ ఏర్పాటు చేసిన స్టూడెంట్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. విద్యార్థుల్లో భయం,ఒత్తిడి,అపోహల కారణంగా మానసికంగా బాధపడుతున్నారని..వారికి వర్చువల్ విధానం ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఫోన్ ద్వారా, వర్చువల్ పద్దతిలో ఒత్తిడితో బాధఫడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల ఆత్మహత్యలను నివారించవచ్చని ఆమె తెలిపారు.
ఆత్మహత్యల నివారణ వారోత్సవాలను పురస్కరించుకుని ప్రముఖ సామాజిక సేవా సంస్థ వన్ లైఫ్ సంస్థ పాఠశాలల స్థాయి నుంచే కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్ అన్నారు. పాఠశాలలు ,జూనియర్ కాలేజీలు, డిగ్రీ ,ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు .విద్యార్థులు ఒత్తిడి ,నిరాశ నిస్పృహ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని…వీటిని నివారించేందుకు వన్ లైఫ్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు .
రోజు రోజుకు పెరిగిపోతున్న మానసిక ఆందోళనలు ,నిస్పృహ,ఒత్తిడి వంటి సమస్యలతో సతమతమవుతున్నవిద్యార్థులు ,యువతకు పరిష్కారం చూపించి వారికి మనోధైర్యం కల్పించేందుకు ఈ కౌన్సిలింగ్ సెంటర్ దోహదపడుతుందని వన్ లైఫ్ సంస్థ డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు .
ఈ కార్యక్రమంలో నలంద విద్యా సంస్థల ఛైర్మన్ శ్రీనివాసరాజు, వన్ లైఫ్ సంస్థ డైరెక్డర్ లక్ష్మీ ప్రసన్న ,పాఠశాల విద్యార్థులు , వన్ లైఫ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు