తిరుమల కు వెళ్ళే ప్రయాణికులకు శుభవార్త
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులలో సీటు రిజర్వ్ తో పాటు శ్రీవారి దర్శనం టికెట్ బుక్ చేసుకునే వారికి ఇక తిరుపతి-తిరుమల టికెట్, రిజర్వేషన్ టికెట్ తో పాటు కలిపి ఇవ్వబడుతున్నది.
తిరుపతి చేరుకొన్న తరువాత అదే టికెట్ తో తిరుపతి ఏడుకొండలు బస్ స్టాండు లో కానీ, అలిపిరి బాలాజి బస్ స్టాండులో కానీ తిరుమలకు వెళ్ళు బస్సులను ఎక్కవచ్చు. అలాగే తిరుపతి చేరుకోవడానికి తిరుమలలో రాంభగీచ లేదా బాలాజి బస్ స్టాండు నందు తిరుపతికి వెళ్ళు బస్సులను ఎక్కవచ్చు. ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చెయ్యడం జరుగును.
ఈ టికెట్టు పొందడం వలన ప్రయాణికులు టికెట్టు కోసం క్యూ లైన్ లలో వేచి ఉండవలసిన అవసరం లేదు. దీనివలన సమయం కూడా ఆదా చేసుకొనవచ్చు.
ఈ టిక్కెట్టు పొందడం వలన టికెట్టు ధరలో రూ.10/- రాయతి పొందవచ్చు.
ఈ టికెట్టు తిరుపతి చేరుకున్న సమయం నుండి 72 గం. ల పాటు తిరుపతి-తిరుమల బస్సులలో చెల్లుబాటు అవుతుంది.
పై సౌకర్యం రేపటి నుండి అనగా 03.02.2022 నుండి అమలు లోకి వస్తుంది.