తెలంగాణ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి లగ్జరీ బస్సులు..!
తెలంగాణ ఆర్టీసీకి అత్యాధునిక హంగులతో… ఆధునిక సదుపాయాల గల సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ట్యాంక్‌బండ్‌పై 50 అత్యాధునిక సూపర్ లగ్జరీ బస్సులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. రూ.392 కోట్ల వ్యయంతో 1016 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయగా తొలి విడతగా 630 సూపర్ లగ్జరీ బస్సులు, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మార్చి లోపల అన్ని బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పువ్వాడ తెలిపారు. వీటితో పాటు అప్పుడెప్పుడో కనుమరుగైన డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే మళ్లీ అందుబాటులోకి రానున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు సొంత వాహనాల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో TSRTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రవాణా, రహదారి, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎండీ వీసీ సజ్జనార్, రవాణ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
