కోడి పందాలకు సిద్ధమవుతున్న గోదావరి జిల్లాలు.. పందెం రాయులకు పండగే..!

సంక్రాంతి సీజన్ మొదలు కావడంతో.. కోడి పందాలకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో నాయకుల అండదండలతో భారీ స్థాయిలో పందేలకు గ్రౌండ్స్ ప్రిపేర్ అవుతున్నాయి. ఏర్పాట్లలో భాగంగా సినీ, సంగీత కార్యక్రమాలు, విందు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి కూడా చాలా మంది గోదావరి ప్రాంతాలకు వెళ్లి పందేలు ఆడుతారు. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. కోడి పందెలు, వాటి ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని పలు పోలీస్ లు తనిఖీలు చేస్తున్నారు. గతంలో కోడిపందాలు నిర్వహించిన వారి వివరాలు సేకరిస్తున్నామని డీఐజీ తెలిపారు. వీరిపై ముందు జాగ్రత్త చర్యగా బైండోవర్ కేసులు నమోదు చేస్తామని.. రూ.5 లక్షల పూచీకత్తుతో స్టేషన్ బెయిల్ ఇస్తామని పాలరాజు పేర్కొన్నారు. అయినప్పటికీ పందాలకు పాల్పడితే ఈ మొత్తాన్ని సీజ్ చేసి.. వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.