రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ జీ.ఓ జారీ
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త పదిహేను ఫైర్ స్టేషన్లతోపాటు 382 పోస్టులను కూడా మంజూరు చేస్తూ జీ.ఓ. ఎం.ఎస్ నెంబర్ 64 ను రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. మంజూరైన 382 పోస్టుల్లో 367 రెగ్యులర్ పోస్టులు కాగా 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్దతిలో చేపట్టేందుకు అనుమతినిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని శాసన సభ నియోజక వర్గాల్లో ఈ కొత్త ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పాటయ్యే ఫైర్ స్టేషన్లు నియోజక వర్గాల వారీగా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా – మల్కాజిగిరి.
రంగారెడ్డి జిల్లా – ఎల్.బి.నగర్, రాజేంద్రనగర్, షాద్ నగర్,
హైదరాబాద్ జిల్లా – అంబర్ పెట్, చాంద్రాయణ గుట్ట, జూబ్లీ హిల్స్,
జనగామ – స్టేషన్ ఘనపూర్.
మహబూబాబాద్ – డోర్నకల్
మెదక్ – నర్సాపూర్
సిద్ధిపేట – హుస్నాబాద్
నాగర్ కర్నూల్ – కల్వకుర్తి
నిజామాబాద్ – బాల్కొండ.
జగిత్యాల – ధర్మపురి.
భద్రాద్రి కొత్తగూడెం – పినపాక