హైదరాబాద్ తాజ్ కృష్ణాలో సూత్రా ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన గ్లామస్ మిసెస్ ఇండియా ప్లస్ సైజ్ విన్నర్ సమైరా ఐ వల్లాని
హైదరాబాద్ , బంజారాహిల్స్
ప్రేమికుల కోసం ప్రత్యేకంగా సూత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఎడిషన్ ను ప్రారంభించినట్లు ఆర్గనైజర్ మోనిక మద్యం తెలిపారు .హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన సూత్రా సీజన్ స్పెషల్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ను గ్లామస్ మిసెస్ ఇండియా ప్లస్ సైజ్ విన్నర్ సమైరా ఐ వల్లాని మోడల్స్ తో కలిసి ప్రారంభించారు . ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 14, 15 , 16 తేదీ వరకు కొనసాగుతుందని..దేశంలోని ప్రముఖ డిజైనర్లు తమ వస్త్ర ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో కొలువుదీరాయని తెలిపారు.
సూత్రా సీజన్ స్పెషల్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ లో క్రియేటివ్ ఫ్యాషన్ వేర్, లైఫ్‌స్టైల్ ,డిజైనర్ వేర్, జ్యువెలరీ, యాక్సెసరీస్ ను అందుబాటులో ఉంచామన్నారు.
ఫ్యాషన్ ప్రియులకు గొప్ప షాపింగ్ అనుభూతిని అందించడానికి ద్వయం జోడించిన సూత్ర ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ మోనిక మద్యం తెలిపారు .భారతదేశంలో అత్యంత ఇష్టపడే ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, డిజైనర్, షాపింగ్ ఎగ్జిబిషన్లలో సూత్రా ఒకటి అని చెప్పారు. ఈ సందర్భంగా మోడల్స్ డిజైనరీ కలెక్షన్స్ ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
“SUTRAA – లైఫ్ స్టైల్ , ఫ్యాషన్ ఎగ్జిబిషన్”, ప్రత్యేకమైన ఫ్యాషన్ వేర్, వెడ్డింగ్ , బ్రైడల్ వేతో పాటు సృజనాత్మక & విలాసవంతమైన ఫ్యాషన్ ఆభరణాలు, ఫ్యాషన్ ఉపకరణాలు అందుబాటులో ఉంచామన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు .