గ్లామ‌న్ మిస్ అండ్ మిసెస్ ఇండియా 2022 ప్లస్ సైజ్ అందాల పోటిల్లో ..మిసెస్ ఇండియా ప్లస్ సైజ్ టైటిల్‌ను దక్కించుకున్న సమైరా ఐ వల్లాని

గోవా

గ్లామోన్ మిసెస్ ఇండియా 2022 పోటీల్లో హైద‌రాబాద్ కు చెందిన స‌మైరాకు ప్ల‌స్ ఈజ్ బ్యూటీఫుల్ టైటిల్ ద‌క్కించుకుంది.

గోవాలో జ‌రిగిన గ్లామోన్ మిసెస్ ఇండియా సీజ‌న్ 6 పోటీల్లో స‌మైరా ప్ల‌స్ ఈజ్ బ్యూటీఫుల్ విజేత‌గా నిలిచారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల ప్రేమ‌, మ‌ద్ద‌తుతోనే ఈ విజ‌యం సాధ్య‌మైంద‌న్నారు.

ఈ అందాల పోటీల కోసం తాను ప్ర‌తి రోజు ఫిట్ నెస్ కోసం వర్కవుట్స్ చేయ‌డంతో పాటు డైట్ కంట్రోల్ చేసుకుని పోటీల్లో పాల్గొన్న‌ట్లు స‌మైరా వివ‌రించారు. నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ కోసం మెటల్‌తో త‌యారు చేసిన వ‌స్త్రాల‌ను వేసుకున్నాన‌ని… అందంగా డిజైన్ చేసిన పిశ్వాస్ డ్రెస్‌పై చార్మినార్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఆమె వివరించారు . ఫైనల్‌లో శారీరక దృఢత్వం,మానసిక బలం,ఓర్పుకు పరీక్ష పెట్టార‌ని…వాట‌న్నింటిని అధిగ‌మించడంతో విజ‌యం సాధ్య‌మైంద‌న్నారు.

ప్ల‌స్ ఈజ్ బ్యూటీఫుల్ అనే సందేశాన్ని ప్ర‌పంచానికి చాటేందుకు ఈ పోటీలు నిర్వ‌హించార‌ని సమైరా తెలిపారు. ఐదు రోజుల పాటు జ‌రిగిన ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు దేశ న‌లుమూల‌ల‌ను నుంచి పోటీదారులు త‌ర‌లివ‌చ్చార‌ని తెలిపారు . ప్రొఫైల్, ఫిట్‌నెస్, ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్‌స్టైల్ ,టాలెంట్‌తో సహా అనేక అంశాలు జడ్జింగ్ కోసం పరిగణనలోకి తీసుకోబడ్డాయ‌ని వివ‌రించారు . గత సంవత్సరం విజేత హైదరాబాద్‌కు చెందిన గ్లామన్ మిసెస్ ఇండియా పల్లవి సింగ్, ఈ సీజన్‌లో జ్యూరీగా ఉన్నారని తెలిపారు.

గ్లామన్ మిస్ & మిసెస్ ఇండియా , గ్లామన్ మిస్ & మిసెస్ ఇండియా (ప్లస్ సైజ్) సీజన్ – 6 మెగా షో గోవాలోని ది ఫెర్న్ కదంబ హోటల్‌లో నిర్వ‌హించారు. ఈ పోటీల‌కు ఢిల్లీ, జైపూర్, చండీగఢ్ తో పాటు బ్యాంకాక్, దుబాయ్‌లలో ఆడిష‌న్స్ నిర్వ‌హించార‌ని చెప్పారు.

గ్లామ‌న్ మిస్ అండ్ మిసెస్ ఇండియా ప్లస్ సైజ్‌లో మిస్ ఇండియా కేటగిరీలో లక్నోకి చెందిన అనురాధ గ్లామన్ మిస్ ఇండియాగా, ఇండోర్‌కు చెందిన కనక్ నగర్, కర్ణాటకకు చెందిన శాంభవి, గుర్గావ్‌కు చెందిన చాహత్ ఖజురియా రన్నరప్‌లుగా నిలిచారని తెలిపారు . మిసెస్ ఇండియా ప్లస్ సైజ్ టైటిల్‌ను సమైరా ఐ వల్లాని గెలుచుకున్నారు. రన్నరప్‌లు. గ్లామన్ మిస్ ఇండియా కేటగిరి (జీరో సైజ్) ఇండోర్‌కు చెందిన శ్రేయా ఓజా గెలుచుకోగా, ముంబైకి చెందిన లిషా మరియు బెంగళూరుకు చెందిన నికితా రాయ్ రన్నరప్‌గా నిలిచారు. మిసెస్ క్యాటగరీ (సైజ్ జీరో) ఢిల్లీకి చెందిన సోనాల్ మహల్వార్, ఇండోర్‌కు చెందిన హర్నీత్ ఛబ్రా, భువనేశ్వర్‌కు చెందిన సస్వతి, భువనేశ్వర్‌కు చెందిన తేజస్మిత మోహపాత్ర రన్నరప్‌లుగా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *