ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. గిడును ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి.రాజేష్ రెడ్డిలను నియమించింది. ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా పల్లంరాజు నియమితులయ్యారు.

క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా హర్షకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్గా తులసిరెడ్డి నియమితులయ్యారు. తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని గిడుగు రుద్రరాజు చెప్పారు. పార్టీ బలోపేతం దిశగా తగిన చర్యలు చేపడతామన్నారు. అందరి సమన్వయంతో బాధ్యతగా పనులు చేపడతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే (ఎన్నికైన కొద్ది రోజుల్లోనే పార్టీని పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఈ దిశలోనే ఏపీసీసీ ప్రెసిడెంట్ గా గిడుగు రుద్రరాజుతో పాటు పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *