మంగళగిరి ఆరవ బెటాలియన్ లో డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో మియావకి విధానం ద్వారా మొక్కలు నాటి డీజీపీ గౌతం సవాంగ్
అమరావతి ,మంగళగిరి
ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం ఎనిమిది బెటాలియన్ లలో15.35 ఎకరాల విస్తీర్ణంలో మియావకి విధానం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమానికి డీజీపీ గౌతం సవాంగ్ శ్రీకారం చుట్టారు. అటవీ శాఖ ద్వారా సేకరించిన 19 వేల 774 మొక్కలను మియావకి విధానం ద్వారా నాటనున్నట్లు తెలిపారు .
మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని బెటాలియన్లలో ప్రారంభించడం గొప్ప అవకాశం గా భావిస్తున్నానని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు . బెటాలియన్లు లో ఈ ఆలోచనను అమలు చేయడానికి అద్భుతమైన అనువైన ప్రదేశమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క సిబ్బంది పాల్గొనాలని కోరారు. మియావకి విధానం ద్వారా డెవలప్‌మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్టు పైన బెటాలియన్ల ADG శంఖబ్రత భాగ్చి తీసుకున్న చొరవ, DIGలతో పాటు ఎనిమిది బెటాలియన్ కమాండెంట్ లు అందిస్తున్న మద్దతుని అభినందిస్తున్నాను. ఇది ఒక కొత్త ఆలోచన అని.., కొన్ని ఆలోచనలు అమలు చేసేటప్పుడు చొరవ, ప్రయత్నాల మధ్య వ్యత్యాసాన్ని కలిగిస్తాయన్నారు. చొరవ, కృషి రెండూ ఖచ్చితంగా అమలు చేస్తూ మన బెటాలియన్ల లోని ప్రాంగణం తో పాటు ఇతర అనువైన ఖాళీ ప్రదేశాలలో ఈ మియావకి విధానం ద్వారా డెవలప్‌మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్టు అభివృద్ధి చేయవచ్చున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే ఈ పద్దతిని మనం అమలు చేయగలము కాబట్టి ఇది పైలట్ ప్రాజెక్ట్ లాంటిదన్నారు. తాము సాధ్యమైనంత మెరుగుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ గొప్ప కార్యక్రమంలో తమ వంతుగా చొరవ చూపుతూ మద్దతు నచ్చినందుకు, ఈ మియావకి విధానాన్ని ప్రవేశపెట్టినందుకు PCCF ,అటవీ శాఖకు అభినందించారు.
ఈ విధానం ద్వారా మనం మొక్కలను మూడేళ్లు మాత్రమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందని.., మూడేళ్ల అనంతరం మొక్క దానంతట పెరుగుతూ ప్రకృతికి ఎంతగానో సహాయపడుతుందన్నారు. మనలో చాలామందికి మన పర్యావరణం కాపాడుకోవాలని ఉంటుంది కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి..? ఏ విధంగా చేయాలి అనే ఆలోచన దగ్గర ఆగిపోతూ ఉంటామన్నారు. అయితే దానికి ఒక పరిష్కారంగా ఒక యాక్షన్ ప్లాన్ గా ఈ విధానం పనిచేస్తుందన్నారు. కేవలం బెటాలియన్ లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో ఈ విధానం పట్ల అవగాహన కల్పించి ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని మొక్కలు స్థానిక రకాలు కాబట్టి ఇవి నిలకడగా పెరగడానికి అవకాశం ఉంటుందని భరోసా ఇవ్వడానికి కూడా అవకాశం ఉందన్నారు. స్థానిక పర్యావరణ వ్యవస్థ వాటిలో ఏ మొక్కలు మనుగడలో ఉన్నాయో కూడా అంచనా వేస్తుందని.. చివరకు ఒక చిన్న అడవిగా ఉద్భవిస్తుందన్నారు.
మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని … పోలీసు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు పిల్లలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం విశిష్టతను ఇతరులకు తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ లు, ఐజీలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
మియావాకీ విధానము అంటే ఏమిటి ?
జపాన్ కు చెందిన వృక్ష శాస్త్రజ్ఞుడు అకిరా మియావకి ఈ పద్ధతికి మార్గదర్శకుడు . హెక్టారుకు 20,000 నుండి 30,000 మొక్కల వరకు నాటి దట్టమైన అడవిని నిర్మించటం ఇలా సాధ్యమౌతుంది . ఇక్కడ స్థానిక జాతి మొక్కలను నాటడం జరుగుతుంది. మొదటి మూడు సంవత్సరాల ఈ మొక్కలను బాగా సంరక్షించుకోవాలి. అనంతరం ఈ మొక్కలు నిర్వహణ రహితంగా పెరుగుతుంది. మియావకి విధానం ద్వారా మొక్కల ఎదుగుదల 10 రెట్లు వేగవంతంగా ఉంటుంది . ఫలితంగా మోనోకల్చర్ కంటే కార్బన్ మోనాక్సైడ్ ను గ్రహించే సామర్ధ్యత 30 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది ఒక అతి విశిష్టమైన ప్లాంటేషన్.