గచ్చిబౌలి క్రీడా మైదానాన్ని క్రీడాకారులు , ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది -శాప్ మాజీ ఛైర్మన్ రాజ్ ఠాకూర్

హైదరాబాద్ , ఫతేమైదాన్ క్లబ్

జాతీయ , అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసిన గచ్చిబౌలి స్టేడియంను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని శాప్ మాజీ ఛైర్మన్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఐదు ఎకరాల స్థలాన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు .ప్రభుత్వానికి పీవీ సింధు ,సానియా మిర్జాలు మాత్రమే కన్పిస్తున్నారని…గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ఎలాంటి ప్రొత్సహకాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు . ఒకప్పుడు క్రీడా హబ్ గా ఉన్నటు వంటి భాగ్యనగరం నేడు క్రీడాభివృద్దికి నోచుకోవడం లేదని విమర్శించారు . హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియం , గచ్చిబౌలి స్టేడియం ,ఉప్పల్ స్టేడియం, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలు నిరుపయోగంగా మారాయని ,కొత్తగా నిర్మించిన మరో రెండు స్టేడియంలు ప్రారంభానికి నోచుకోలేదన్నారు . గచ్చిబౌలి స్టేడియంలో గేమ్స్ జరుగుతున్నప్పుడు క్రీడాకారుల వసతి కోసం నిర్మించిన స్పోర్ట్స్ టవర్‌ను టిమ్స్ ఆసుపత్రిగా ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం క్రీడాకారుల కోసం , క్రీడల అభివృద్ది కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాజ్ ఠాగూర్ విమర్శించారు .

ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణం కోసం ఐఐఐటీ పక్కన ఖాళీగా ఉన్న స్థలాలను ఉపయోగించుకోవాలని సలహా ఇచ్చారు . స్టేడియంలో కోచ్‌లను రెగ్యులరైజ్ చేయలేదని..కోచ్‌లకు చాలీ చాలని జీతాలు ఇస్తున్నారని మాజీ శాఫ్ ఛైర్మన్ రాజ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు .ఇక జిల్లాలలో ఉన్న స్టేడియాలలో కరెంట్ బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్నాయన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *