గాంధీ జయంతి అక్టోబర్ 2 న రోజున బొటానికల్ గార్డెన్ వద్ద జరిగే రన్ ఫర్ పీస్ ను విజయవంతం చేయాలి: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

హైదరాబాద్

బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రన్ ఫర్ పీస్ అనే పేరుతో 10K,5K,2K వాక్ లను విజయవంతం చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. హైదరాబాద్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ లో అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున నిర్వహించనున్న రన్ ఫర్ పీస్ పోస్టర్ ను మెదక్ లోక సభ సభ్యుడు ,అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ డా.జి.చంద్రశేకర్ రెడ్డిలు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బొటనికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ చేపట్టిన రన్ ఫర్ ఫీస్ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి అభినందించారు. ఈ అసోసియేషన్ కి గౌరవ అధ్యక్షుడిగా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక ముందు మా అసోసియేషన్ వారు ఎలాంటి కార్యక్రమాలు చేసినా తన సహకారం ఉంటుందన్నారు.నిత్యం పని ఒత్తిడితో సతమతం అవుతున్న ప్రజలకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పచ్చదనం, జీవ వైవిద్యాన్ని పెంపొందించే విషయంలో ఆటవీ శాఖ అభివృద్ధి సంస్థ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుందని, అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బొటనికల్ గార్డెన్ ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలకు మంచి ఆహ్లాదాన్ని స్వచ్ఛమైన ఆక్సిజన్ ని అందిస్తూ వాకర్స్ కి ఆరోగ్యానికి చిరునామాగా మారిందని సంస్థ వైస్ చైర్మన్ , డా.జి.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బొటనికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తాము అసోసియేట్ గా ఉండటం సంతోషంగా ఉందన్నారు. భవిష్య్తతులో ఎలాంటి కార్యక్రమానికైనా మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఫిట్ నెస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 10 కె 5 కె ,2కె రన్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు చల్లా భరత్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి పెండ్యాల బాలకిషన్ రావులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బాలకిషన్ రావు కోరారు.ఆసక్తి ఉన్న వారు ఈ క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నిర్వహణ కార్యదర్శి N శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వాసుదేవరావు,
Treasurer జీ వీ ఎన్ రాజు,M నాగరాజు, యాదవ రావు, శ్రీశైలం, చాంద్ పాషా, రమేష్, కవిత లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *