దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్న ఫ్రాంక్లిన్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు : కో ఫౌండర్ నవీన్ కుమార్, రంజిత్ కుమార్
రూ.50 కోట్లతో కంపెనీ విస్తరణ
డిసెంబర్ నాటికి 200 షోరూంలు
మరిన్ని దేశాలకు ఎగుమతులు
డ్యూయల్ బ్యాటరీ కోరో సంచలనం
హైదరాబాద్, జనవరి 10:
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఫ్రాంక్లిన్ ఈవీ దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళిక రచించింది. 50 కోట్ల రూపాయలతో కంపెనీని విస్తరించి…దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు ఫ్రాంక్లిన్ ఈవీ కో ఫౌండర్లు నవీన్ కుమార్, రంజిత్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 200 షోరూంలను ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు . తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులో కంపెనీ ఇప్పటికే అడుగుపెట్టిందని… హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ వంటి 30 నగరాల్లో మొత్తం 54 షోరూంలను నిర్వహిస్తున్నట్లు కో ఫౌండర్ నవీన్ కుమార్ తెలిపారు .ఒక్క హైదరాబాద్‌లోనే 14 షోరూంలు ఉన్నాయని.. 2021లో అమ్మకాలను ప్రారంభించి ..రెండేళ్లలోనే 6,000 పైచిలుకు కస్టమర్లను సొంతం చేసుకున్నామని తెలిపారు.

ప్రస్తుతం కొత్తగా ఫ్రాంచైజీ కోసం 30 మంది ఔత్సాహికులతో చర్చలు జరుగుతున్నామని..దీంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్రికాకు ఎగుమతులు చేస్తున్నామన్నామని కో ఫౌండర్ రంజిత్ కుమార్ వివరించారు. ఈ ఏడాది చివరికల్లా నెలకు 3,000 యూనిట్ల అమ్మకాల లక్ష్యం ముందుకు వెళ్తున్నట్లు లక్ష్యాన్ని చేరుకోవడానికి రూ.50 కోట్లతో విస్తరణ చేపడుతున్నామన్నారు. కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు సైతం ఆసక్తిగా ఉన్నారు అని వెల్లడించారు.
తొలి డ్యూయల్ బ్యాటరీ స్కూటర్ కోరో
కోరో పేరుతో విక్రయిస్తున్న మోడల్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని.. దక్షిణాది రాష్ట్రాల్లో డ్యూయల్ బ్యాటరీతో తయారైన తొలి మోడల్ ఇదే కావడం విశేషమని రంజిత్ కుమార్ తెలిపారు . ఒకసారి చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చుని… ధర డ్యూయల్ బ్యాటరీ రూ. 1,14,000, సింగిల్ బ్యాటరీ వేరియంట్ రూ.81,450 ఉందన్నారు. కోరోతో పాటు పవర్ ప్లస్, నిక్స్ డీలక్స్ మోడళ్లు మార్కెట్లో ఉన్నాయని రంజిత్ తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలోగా మరో రెండు కొత్త మోడళ్లు ప్రవేశపెడతామని రంజిత్ తెలిపారు. ఫేమ్–2 సబ్సిడీ అనంతరం వీటిని రూ.65–70 వేలకే విక్రయిస్తామన్నారు. ఇవి ఒకసారి చార్జింగ్‌తో 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాయని… దక్షిణాది రాష్ట్రాల్లో ఫేమ్–2 కింద సబ్సిడీ కలిగిన మోడళ్లను కంపెనీ మాత్రమే తయారు చేస్తోందన్నారు. కస్టమర్ల ఇంటి వద్దనే సర్వీస్ అందిస్తామని… 10 ఏళ్లపాటు స్పేర్ పార్ట్స్ సర్వీస్ ఉంటుందని వివరించారు.
రిమూవేబుల్ బ్యాటరీలు..
స్కూటర్లలో మోడల్‌నుబట్టి 2.1–3 కిలోవాట్ లిథియం అయాన్, లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీలను పొందుపరిచామని నవీన్ తెలిపారు. న్యూ ఎనర్జీ టెక్, ఈవీఈ కంపెనీ, మోలిసెల్ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన బ్యాటరీలను వినియోగిస్తున్నామన్నారు. బ్యాటరీలకు ఐక్యాట్–ఏఐఎస్ 156, బీఐఎస్, సీఈ, ఐఎస్‌వో, ఆర్‌వోహెచ్‌ఎస్ ధ్రువీకరణ కలిగిందన్నారు.
సులభ చార్జింగ్ కోసం వాహనం నుంచి వేరు చేసేలా రిమూవేబుల్ బ్యాటరీలను వినియోగిస్తున్నామని రంజిత్ తెలిపారు. స్కూటర్ల ధరల శ్రేణి రూ.75 వేల నుంచి ప్రారంభం అని… సింగిల్ బ్యాటరీతో ఒకసారి చార్జింగ్‌తో 100–120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చన్నారు. అన్ని మోడళ్లకు వారంటీ మోటార్‌పై రెండేళ్లు, కంట్రోలర్‌పై ఏడాది, బ్యాటరీపై మూడేళ్లు, చార్జర్‌కు ఒక ఏడాది ఉందన్నారు. ఫ్రాంక్లిన్ ఈవీ స్కూటర్లకు రెండేళ్లపాటు సర్వీస్ ఉచితం అన్నారు.
దక్షిణాదిన తొలి కంపెనీ..
హైదరాబాద్‌లోని చర్లపల్లి వద్ద రెండు ఎకరాల్లో ఫ్రాంక్లిన్ ఈవీ తయారీ ప్లాంటు ఉందని…. 100 ఈ–స్కూటర్లు తయారీ సామర్థ్యం కలిగి ఉందన్నారు . ఏప్రిల్‌లో మార్కెట్లోకి రానున్న రెండు మోడళ్లను పూర్తిగా దేశీయంగా తయారు చేస్తున్నట్టు నవీన్ తెలిపారు.
ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో 100 శాతం లోకలైజేషన్ చేస్తున్న కంపెనీ తలమదేనన్నారు. పవర్ ప్లస్, నిక్స్ డీలక్స్, కోరో మోడళ్ల విషయంలో లోకలైజేషన్ 70 శాతం ఉంది. కొటక్ మహీంద్రా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ద్వారా వాయిదాల్లో కస్టమర్లు ఫ్రాంక్లిన్ ఈవీ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చన్నారు. జీరో డౌన్ పేమెంట్ సౌకర్యమూ ఉంది అందుబాటులో ఉందని అని వివరించారు.