పీఆర్సీ సాధన కోసం : నల్లబ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలు

ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు నేడు, రేపు డిపోల వద్ద ధర్నాలు చేపడుతున్నట్లు ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్‌ తెలిపారు. ఏ క్షణం నుంచైనా సమ్మెకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు సహాయ నిరాకరణ, నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావడం, భోజన విరామ సమయంలో ధర్నాలు చేపడతామని నాయకులు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు కోల్పోతున్న తమ హక్కులను సాధించుకునేందుకు ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అనంతపురం జిల్లాలో ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు కార్మికులు ఉదయం నుంచే నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంబరపడిన మేము హక్కులు కోల్పోతున్నందునే ఆందోళన చేపట్టాల్సి వస్తోందని కార్మికులు స్పష్టం చేశారు.

విశాఖలో ఆర్టీసీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పీఆర్సీ సాధన సమితి చేపట్టిన సమ్మెకు మద్దతుగా నిరసన తెలుపుతూ నల్లబ్యాడ్జీల కార్యక్రమం చేపట్టారు.

పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలో పాల్గొనేందుకు ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. అన్ని డిపోలు, యూనిట్ల వద్ద శని, ఆదివారాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పి.దామోదరరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు రోజులు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలన్నారు. టీ, భోజన విరామ సమయాల్లో ధర్నాలు నిర్వహించాలని తెలిపారు. మరోవైపు సమ్మె అత్యవసర సేవల నిర్వహణ చట్టం-1971 ప్రకారం చట్టవ్యతిరేక చర్య కిందకు వస్తుందని ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీచేశారు.

వీలైనన్ని బస్సులు నడపాలి

సమ్మె కాలంలో వీలైనన్ని ఎక్కువ బస్సులు నడపాలని, అర్హులను డ్రైవర్లుగా, కండక్టర్లుగా తీసుకొని సేవలు వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ శుక్రవారం రాత్రి ఆదేశాలనిచ్చారు. హాజరైన సిబ్బంది, ప్రయాణికుల భద్రత, స్థానిక పరిస్థితులు తదితరాలన్నీ చూసుకొని వీలైనన్ని ఎక్కువ సర్వీసులు నడపాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *