సికింద్రాబాద్ వివాహా భోజనంబు రెస్టారెంట్ లో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
విభిన్న రుచులు కోరుకునే భాగ్యనగర వాసుల కోసం నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లు ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాయి. సికింద్రాబాాద్ సంగీత్ ఛౌరస్తాలోని వివాహ భోజనంబు తెలుగు క్యూసిన్ రెస్టారెంట్ లో ఫీప్ట్ లైక్ ఏ కింగ్ పేరుతో ఫుడ్ ఫెస్టివల్ ను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. మినీ ఇండియా అయిన హైదరాబాద్ లో అన్ని రాష్ర్టాల వంటకాల రుచులతో పాటు తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ కు చెందిన వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయయడం అభినందనీయమని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.
సరికొత్త వెరైటీ వంటకాలతో ప్రత్యేకంగా మెనూను తయారు చేసింది రెస్టారెంట్ యాజమాన్యం . శాఖాహారంలో కాకతీయ శాఖాహార పలావ్, కోనసీమ పన్నీర్ వేపుడు, నల్లకారం , పుట్టగొడుగుల వేపుడు ,కోనసీమ గోబీ వేపుడు, విందు భోజనం, అల్లనేరేడు లస్సీ, పప్పు, చారన్నంలు ఈ ఫుడ్ ఫెస్టివల్ లో ప్రత్యేకంగా తయారు చేశారు. ఇక మాసాహారం విషయానికి వస్తే తెలంగాణ కోడి పలావ్, తందూరి చేప, గోల్గొండ కోడి, రామగుండం కోడి వేపుడు, గోంగూర రొయ్యల పలావ్ వంటి ఘమఘమలాడే రుచికరమైన వంటకాలు ఈ ఫెస్ట్ లో నోరూరిస్తున్నాయి. అనంతరం నిర్వహకులు రవిరాజు మాట్లాడుతూ ప్రతి నెలకు ఒక సారి వివాహ భోజనంబు రెస్టారెంట్ లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తామని… ఒక్క నెల ఒక్కో ప్రత్యేకత ఉంటుందన్నారు. కెనడా, యూఎస్ లో ఉన్న తెలుగు వారికి వివాహా భోజనంబు రుచులు అందించేందుకు తమ రెస్టారెంట్లను ఏర్పాటు చేయనున్నట్లు రవిరాజు తెలిపారు. ఏపీలోని తిరుపతిలో వివాహ భోజనంబు రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.