ప్రణీత్ గ్రూప్ నుంచి మరో ఐదు ప్రాజెక్ట్ లు ప్రారంభం

బ్రోచర్ ను ఆవిష్కరించిన ఫైనాన్స్ డైరెక్టర్ నరసింగ్ రావు

ప్రణీత్ గ్రూప్ తో అసోసియేట్ కావడం తనకెంతో సంతోషంగా ఉంది డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ

రియల్ ఎస్టేట్ రంగంలో 22 ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన ప్రణీత్ గ్రూప్ కొత్తగా మరో ఐదు ప్రాజెక్ట్ లను లాంచ్ చేసింది. హైదరాబాద్ మియాపూర్ నరేన్ కన్వెన్షన్ సెంటర్ లో కస్టమర్లు,అభిమానుల సమక్షంగా కొత్త ప్రాజెక్ట్ బ్రోచర్ లను సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ నరసింగ్ రావు, ఛైర్మన్ నరేంద్ర కుమార్ కామరాజులు ఆవిష్కరించారు.

ప్రణీత్ ప్రణవ్ సొలిటైర్, ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్, ప్రణీత్ ప్రణవ్ జైత్ర, ,ప్రణీత్ ప్రణవ్ డాఫ్పోడిల్స్, ప్రణీత్ ప్రణవ్ ఎక్స్ పీరియా ప్రాజెక్ట్ బ్రోచర్ ను లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లను వచ్చే రెండున్నర ఏళ్ళలో పూర్తి చేస్తామని నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు . ప్రణీత్ గ్రూప్ లో పెట్టుబడులు పెడితే భవిష్యత్ లో మంచి లాభాలను అర్జించవచ్చని వెల్లడించారు .

ఐదు కొత్త ప్రాజెక్ట్స్ రెండున్నర సంవత్సరాల్లొ పూర్తిచేయనున్నట్లు ప్రణీత్ గ్రూప్ చైర్మన్ నరేంద్రకుమార్ కామరాజ్ తెలిపారు. ఒకేసారి ఐదు ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రణీత్ గ్రూప్ లో పెట్టుబడులు పెడితే భవిష్యత్ లో మంచి ఫలితాలు ఉంటాయన్నారు . కస్టమర్లు ఈ ఆవకాశం వినియోగించుకోవాలని ఆయన కోరారు కోరారు. త్వరలో మరిన్ని ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నట్లు నరేంద్ర కుమార్ కామరాజు వెల్లడించారు.

ప్రణీత్ గ్రూప్ సంస్థతో తాను అసోసియేట్ కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ.ప్రణీత్ గ్రూప్ సకాలంలో ప్రాజెక్ట్ లను పూర్తి చేసి కస్టమర్లకు అందిస్తూ నాణ్యమైన సేవలు అందించడం వల్లే 15 సంవత్సరాలు సక్సెస్ ఫుల్ గా ముందుకువెళ్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు రామాజనేయ రాజు, నర్సిరెడ్డి,ఆదిత్య, సందీప్ రావులతో పాటు సినీ నటుడు డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ ,మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు .

ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈవెంట్ లో చిన్నారుల కోసం కిడ్స్ జోన్, మహిళల కోసం మోహందీ, ఫోటో షూట్ , గేమ్స్ జోన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు కస్టమర్లను అలరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *