రాజవొమ్మంగిలో జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన కలచివేసింది..ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం :నారా చంద్రబాబు నాయుడు

తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం దొడ్డి గ్రామంలో జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన తీవ్రంగా కలచివేసిందని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు .మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతిని తెలుపుతున్నా… ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గ.మన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం విధానంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. మద్యాన్ని ప్రధాన ఆదాయవనరుగా ప్రభుత్వం భావించడం వల్లే ఈ దుస్థితి నెలకొందని.. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జిలుగు కల్లు తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *