హైదరాబాద్ మణికొండలో ఏ 2 జెడ్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ టీమ్
హైదరాబాద్ మణికొండలో ఏ 2 జెడ్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ టీమ్
హైదరాబాద్, మణికొండ
ఇండియాలోనే మొట్టమొదటి ఆక్సిజన్ థీమ్ ఏ 2 జెడ్ బాస్కెట్ గ్రీన్ సూపర్ మార్కెట్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందిఅని సినీనటి సంచితా భాస్ అన్నారు.హైదరాబాద్ మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ 2 జెడ్ సూపర్ మార్కెట్ ను ఆమె ప్రారంభించారు .
నిత్యావసర వస్తువులు ,కూరగాయలు ,ఇంటి ,వంట సామాగ్రి అన్ని ఒకే చోట అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు .
ఉమెన్ ఎంటర్ ప్రైనర్స్ ను ప్రొత్సహించేందుకు ఏ 2 జెడ్ సూపర్ మార్కెట్ తీసుకువచ్చామని..ఇందులో పనిచేసే వారు సైతం మహిళలేని ఏ 2 జెడ్ బాస్కెట్స్ ఫౌండర్ నందిని పులివర్తి, తుషార్ కుంకుపూడి తెలిపారు . ఉమెన్ Entrepreneur సపోర్టు చేయడానికి ప్రాంఛైజ్ ఫీజు లో 50% రాయితీ కల్పిస్తున్నామని…వారికి సపోర్టు గా ఉంటూ స్టాక్ రేటు లలో కూడా డిస్కౌంట్ అందిస్తామన్నారు. మహిళలను ప్రోత్సహిస్తూ స్టాంగ్ ఉమెన్ సొసైటీ ని తయారు చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు . ఈ సూపర్ మార్కెట్ లో మీ ఇంటికి సరిపోయే అన్ని వస్తువులు లభిస్తాయన్నారు. ఏటూజెడ్ సూపర్ మార్కెట్ ను ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ టీమ్ ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు .