నీటిలో మునిగిన ఫిలింనగర్ బీజేఆర్ నగర్‌ ప్రభుత్వ పాఠశాల..పట్టించుకునే నాధుడే లేడు – ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌

హైదరాబాద్

వరద ముంపుకు గురైన బీజేఆర్ నగర్‌ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌

బీజేఆర్ నగర్‌ ప్రభుత్వ పాఠశాలను దుస్థితిఫై ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ ఫైర్

ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బీజేఆర్ నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గత 15 రోజులుగా వరద ముంపుకు గురైంది. వందలాది మంది విద్యార్థులు చదువుకునే ఈ పాఠశాల లో మోకాల్లోతు నీరు వచ్చి చేరిన.. ఒక్కసారి కూడా అధికారులెవరూ వచ్చిపాఠశాలలో ఉన్న నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకపోవడం పట్ల ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు.

పాఠశాలలోని గదులతో సహా ఆవరణ మొత్తం మోకాల్లోతు నీటితో నిండిపోయింది. ఇంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నప్పటికీ దీనిని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మరియు విద్యాశాఖ అధికారులపై పట్టించుకోకపోవడం ఫై డాక్టర్ దాసోజు శ్రవణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కనీసం సొయా ఉందా అని ప్రశ్నించారు. మీ నియోజకవర్గం లో గత రెండువారాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా నీరు ఉంటె మీరు ఏంచేస్తున్నారు..? పంపులు పెట్టించి ఈ వాటర్ ను తీసేయొచ్చు..ఒకవేళ నాలా ఔట్లెట్ లేకపోతే.. దానిని ఏర్పటు చేయొచ్చు.. GHMC అధికారులుకానీ , స్థానిక నేతలు కానీ , విద్యాశాఖ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపనపోలేదంటే..ఈ ప్రభుత్వానికి పేదవాడి చదువు ఫై ఎంత శ్రద్ద ఉందనేది అర్థమైపోతుందని శ్రావణ్ నిప్పులు చెరిగారు.

ఇది గోదావరి నది ఒడ్డున మునిగిన కాళేశ్వరం పంపుహౌస్ కాదు , హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ ఫిలిం నగర్ లో బడా వ్యక్తులు , కోటీశ్వరులు నివాసం ఉండే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఇది. రోజుకూలి పని చేసుకుంటూ.. తమ పిల్లలను ప్రవైట్ స్కూల్స్ లలో చదివించలేని నిరుపేద వారు..ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే..ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వారిని చులకనగా చూస్తుందని శ్రావణ్ వాపోయారు. గత 15 రోజులుగా స్కూల్ లో మోకాల్లోతు నీళ్లు ఉన్న పట్టించుకోకుండా ఉన్నారంటే ఈ ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. టిఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నాశనమైంది. సుమారు 20,000 టీచర్ పోస్టులు, 12,600 విద్యా వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటికీ నియామకాలు జరపడం లేదు.. ప్రభుత్వ పాఠశాలలకు బుక్స్ పంపిణి చేయడం లేదు..మధ్యాహ్న భోజన పథకము అమలు చేయడం లేదు. పాఠశాల విద్యార్థులకు డ్రెస్ లు పంపిణి చేయడం లేదని శ్రవణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఓక్రిడ్జ్, డిపిఎస్ వంటి అంతర్జాతీయ పాఠశాలలను ప్రభుత్వం ఆదరించి ప్రోత్సహిస్తోంది. కానీ పేద SC, ST, BCలు మరియు మైనారిటీల వర్గాల విద్యార్థులను బతికించే ప్రభుత్వ పాఠశాలలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కోటేశ్వర్లు ,రాజకీయ నేతలు , బడా బాబులు ఉండే ఈ ప్రాంతంలోని ప్రభుత్వ స్కూల్ పరిస్థితి ఇలా ఉంటె.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి నిద్రపోతున్నారా? విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు. 15 రోజులుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా వారిని సందర్శించే సమయం లేదా.. కనీసం పాఠశాల నుండి నీరు బయటకు తీసే తీరిక లేదా..? ప్రభుత్వ పాఠశాలల పట్ల సీఎం, విద్యాశాఖ మంత్రికి ఉన్న నిబద్ధత ఇదేనా? అంటూ శ్రవణ్ నిలదీశారు. నీరు నిలిచిన ఆవరణలో తిరుగుతూ అధికార నేతలను , స్థానిక ఎమ్మెల్యే ను , కార్పొరేటర్లను ప్రశ్నించారు. ఈ పాఠశాలలో వర్షం నీరు చేరడం ఇదే మొదటిసారి కాదు.. వర్షాకాలంలో ఇది నిత్యకృత్యం. పది నిమిషాల వర్షం పడితే పాఠశాలలో మోకాల్లోతు నీరు చేరాల్సిందే. దీనిని పరిష్కరిద్దామనే ఆలోచనే చేయడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌గానీ, డీఈవోగానీ పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం నిరాశాజనకంగా ఉంది. నీటి ఎద్దడి కారణంగా పాఠశాలను 15 రోజులుగా మూసివేయడం తో విద్యార్ధులు చదువుకు దూరమయ్యారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రాజకీయాలపై వ్యాపారాలఫై ఉన్న శ్రద్ద.. పేద పిల్లలకు చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాలల ఫై లేదన్నారు.

పేద పిల్లల చదువులు, సాధికారతలపై సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలకు ఏమాత్రం పట్టింపు లేదన్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు..? 15 రోజులుగా సమస్య కొనసాగుతూ పాఠశాలలు మూతపడుతున్నా డీఈవో ఎందుకు చర్యలు తీసుకోలేదు..? విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉన్నతాధికారుల అవకతవకలను ఎత్తిచూపుతూ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌పై మండిపడ్డారు. రేపటి నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున, అధికారులు వెంటనే పాఠశాలలోని నీటిని తీసివేయాలి అని డాక్టర్ దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *