సినీ దర్శకులు ,కళా తపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
హైదరాబాద్ ప్రముఖ సినీ దర్శకులు కె.విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కె.విశ్వనాథ్ గురువారం రాత్రి ఆయన నివాసంలో చనిపోయారు.

శంకరాభరణం, సాగరసంగమం ,సిరివెన్నెల, స్వాతిముత్యం, సిరిసిరి మువ్వ, స్వర్ణకమలం, శుభసంకల్పం, ఆపద్భాందవుడు వంటి సినిమాలకు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చాయి. ఇలా ఎన్నో సినిమాలు.. ఒక్కోటి ఒక్కో అద్భుతమైన కావ్యంగా చెప్పుకోవచ్చు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. కె.విశ్వనాథ్ సినిమాలే కాదు..ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. తెలుగు సినీ పరిశ్రమకు గొప్ప దర్శకుడిని కోల్పోయిందంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాద్యమాల ద్వారా సంతాపం తెలిపారు.