హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో డిజైర్ డిజైనరీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీ నటి శ్రీలేఖ
హైదరాబాద్ , మాదాపూర్
భారతీయ సంస్కఈతీ సాంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే ఎంతో ఇస్టమని సినీ నటి శ్రీలేఖ అన్నారు .హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు రోజుల పాటు జరగనున్న డిజైర్ డిజైనరీ ఎగ్జిబిషన్ ను చీఫ్ ఆర్గనైజర్ అనితా అగర్వాల్ తో కలిసి ఆమె ప్రారంభించారు .
దేశంలోని నలు మూలలకు చెందిన ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు చీఫ్ ఆర్గనైజర్ అనితా అగర్వాల్ తెలిపారు .
ఈ నెల 4, 5, 6 తేదీల్లో హైటెక్ సిటీలోని ఎన్ కన్వెన్షన్‌లో డిజైర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు .ఫ్యాషన్ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు ఆమె తెలిపారు.
పెళ్ళిళ్ళు ,పండుగలను పురస్కరించుకుని సరికొత్త హాట్ కోచర్, ప్రత్యేకమైన జీవనశైలి అలంకరణలు, తాజా ఉపకరణాలు ,ఇరర ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నట్లు అనితా అగర్వాల్ తెలిపారు.